• స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే
• వ్యర్థ కాలుష్యంతో నష్టపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలి
• న్యాయం జరుగుతుందని గీత కార్మికులు, రైతుల ఆశాభావం
• రాష్ట్ర పార్టీ ఆదేశాలతో ఆందోళనకు కార్యాచరణ
• దివీస్ కు వంతపాడుతున్న ఇతర పార్టీల నాయకుల అంతర్మథనం
• 'ఆదాబ్ హైద్రాబాద్'లో గత ఏడాదిగా దివీస్ ల్యాబ్ పై వరుస కథనాలు
హైదరాబాద్ 29,నవంబర్ (ఆదాబ్ హైదరాబాద్): యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం లింగోజిగూడెం గ్రామ పరిధిలో ఉన్న దివీస్ ల్యాబోరేటరీస్ పరిశ్రమ కాలుష్యంతో ఈ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. దివీస్ కంపెనీ నుంచి విడుదల చేసే వ్యర్థ కాలుష్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎన్నోసార్లు స్థానిక ప్రజలు ఆందోళన బాట పట్టిన ఘటనలు చూశాం. గాలి, నీరు, కాలుష్యంతో రైతులు, గీత కార్మికులు, స్థానికులు నష్టపోతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులకు కంప్లైంట్స్ చేసిన, ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకెళ్లిన దివీస్ కాలుష్యం బాధ పోవడం లేదు. అటు పీసీబీ అధికారులకు పరిశ్రమ యాజమాన్యం వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటూ వారికి అండగా నిలుస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే, ఎంపీలు సహా పొలిటికల్ పార్టీల నేతలు సైతం దివీస్ ల్యాబ్ తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని సపోర్ట్ చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ పార్టీ దివీస్ కంపెనీపై యుద్ధం చేయడానికి సిద్ధమవుతుంది. దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్లు ఎన్నో ఏళ్లుగా రైతులు, గీతకార్మికులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా అని అంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ నారాయణపురం మునుగోడు మండలాల ప్రజలు దివీస్ పరిశ్రమలో ఇబ్బందులు గత ఇరవై సంవత్సరాలుగా ఉత్పత్తులు కొనసాగిస్తున్నారు. ఉత్పత్తుల నుండి వెలువడిన వ్యర్థాలను నిబందనలకు విరుద్ధంగా భూగర్భంలోకి వదలడంతో పరిసర గ్రామాలలో పరిసర ప్రాంతాలు కాలుష్య కాసారాలుగా మారడంతో భూగర్భ జలాలు కనీసం వినియోగానికి పనికి రాకుండా పోయాయిని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.
This story is from the 30-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 30-11-2024 edition of AADAB HYDERABAD.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
పోలీసు యూనిఫాం అంటే క్రమశిక్షణకు గుర్తు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లపై కనక వర్షం
- రూ.259 కోట్లు కురిపించిన ఫ్రాంచైజీలు?
చరిత్రలో నేడు
నవంబర్ 30 2024
దివీస్ పై కమలంకొట్లాట
ఫార్మా కంపెనీపై బీజేపీ సమరభేరికి సిద్ధం
పార్టీ బలోపేతానికి కఠిన నిర్ణయాలు తప్పవు
• పార్టీలో క్రమశిక్షణ చాలా అవసరం • ఎట్టి పరిస్థితుల్లోనూ అందరం ఐక్యంగా ఉండాలి
ఆర్టీసీ బస్సు బోల్తా..
• 9మంది దుర్మరణం • మరో 25 మందికి గాయాలు
నేడు చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం
• కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా ప్రారంభం • రూ. 428 కోట్లతో అత్యాధునికంగా స్టేషన్ నిర్మాణం
ఫుడ్ పాయిజన్ వెనుక ఆర్ఎస్ ప్రవీణ్
• టైం వచ్చినప్పుడ కేసీఆర్... కేటీఆర్ అరెస్టు అవుతారు • సంచలన కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖ
డిసెంబర్ 9న సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
• సోనియా జన్మదినం కావడంతో ఇదే రోజును ఫిక్స్ చేసిన రాష్ట్ర నాయకులు • ఢిల్లీ నేతల రాకతో నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం
నిరుపేదలకే తొలి ప్రాధాన్యం
• ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం • లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి