చివరిచూపునకు రాలేకపోయి నందుకు.. జనం మధ్య, జనం కోసం, జనంతో ఉండి నీ అంత్య క్రియలను చూడలేకపోయి నందుకు.. అంటూ ఇటీవలే మరణించిన పెద్దపల్లి పెద్దమ్మ మధురమ్మ చిన్నకొడుకు, సీపీఐ(మావోయిస్టు) పొలిట్ బ్యూరో సభ్యులు
మల్లోజుల వేణుగోపాల్ రాసిన లేఖ..
కట్టా నరేంద్రచారి గారికి నమస్తే
అన్నా, నువు ఎవరో నాకు తెలియదు. అమ్మ గురించి నువు రాసిన మాటలు నన్ను కన్నీళ్ల పర్యంతం చేశాయి. నీకు చేతులెత్తి దండం పెడుతున్నానన్నా. అమ్మతో నాకున్న ఆత్మీయానుబంధాన్ని నీ అక్షరాలు శక్తిమంతంగా నా ముందు నిలిపి నన్ను ఏడిపించాయి. మీ ఆశీస్సులు, సహకారం వుంటే విప్లవకారుల కుటుంబాలు గుండె ధైర్యంతో వుండడమే కాదు, నాలాంటి వాళ్లు మరింత పట్టుదల, ఉత్సాహంతో నమ్మిన ప్రజల కోసం బొందిలో ప్రాణం వున్నంత వరకు పని చేస్తామన్నా. నేనింత కన్నా మరేం రాయాలన్నా. మూడు కుర్చీలలో వున్న నావారి పక్కన నాల్గవ కుర్చీలో నాకు స్థానం ఇవ్వండని మిగిలిన నా కుటుంబ సభ్యులను కోరుకోవడం తప్ప నాకు మరేం అవసరం లేదన్నా. సంపదలు, ఆస్తులు మాకెందుకన్నా. నా భుజాల మీద కూచోని నాతో ఆటలాడుకున్న నా తల్లి దీప, దాని సోదరులు మా ఇంటి ముఖం చూడని బాబాయ్ మాకొకడు వున్నాడని గుర్తు పెట్టుకుంటే చాలన్నా. కోట్లాది జనం గుండెల్లో మా స్థానం పదిలంగా భద్రపరచబడిందని తెలుసు కదా.నాకు అడవిలో ఎందరో పేరీలు (పెద్దమ్మలు), కూచిలు (చిన్నమ్మలు) వున్నారు. నేను కొద్ది మాసాలు అగుపడకుంటే తల్లడి ల్లిపోతారు. వాకబు చేస్తుంటారు, 'బిడ్డకు ఏం కాలేదు కదా?' అని. ఆ ప్రేమ చాలు. అమరుడైన నా సోదరుడి సహచరి నా వదిన ఈ వార్తను ఎలా తట్టుకుంటుందోనన్నదే ఇప్పుడు నా చింత. ఈ మధ్యనే నన్ను కలసి వెళ్లింది. క్షేమంగానే వుంది. ఉంటానన్నా. అన్నా. నీ అనుమతి లేకుండా నీ ఫోన్ నంబరు ఈనా స్పందనను పంపుతున్నందుకు మన్నించన్నా.
-సోదరుడు
(‘అమ్మా మళ్లీ పుడతావా?' అంటూ 'దిశ'లో ప్రచురితమైన కథనానికి స్పందనగా)
This story is from the November 13, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 13, 2022 edition of Dishadaily.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం