“నైపుణ్యాలను సరైన ధరకు అమ్ముకోవాలేగాని, ఆత్మను అంతరాత్మను ఎన్నటికీ అమ్ముకోరాదని" నాటి అమెరికా అధ్యక్షులు అబ్రహమ్ లింకన్ పేర్కొనడం మనకు తెలుసు. దీనిని మనందరం గుర్తుంచుకోవాలి.
జీవితానికి గుర్తింపునిచ్చేది విజ్ఞాన వివేకాలయితే, జీతానికి మూలం ఉద్యోగ సాధన నైపుణ్యాలు అవుతాయి.ఉద్యోగం సాధించిన తరువాత వేతన ప్యాకేజీ విషయం చర్చకు వస్తుంది. శాస్త్ర సాంకేతిక ప్రతిభతో పాటు జీవన నైపుణ్యాలు అలవరచ్చుకోవటం ముఖ్యమైన అంశంగా తోస్తుంది.
ఈ అంశాల్లో మన పరిజ్ఞానం, ప్రతిభను బట్టి మాత్రమే వార్షిక వేతనంతో పాటు ఉద్యోగ హోదా ఆధారపడి ఉంటాయి. నైపుణ్య సంపద గలవారి వెంట ధనం, గౌరవం, హోదా వస్తాయి. అత్యున్నత నైపుణ్యాలు ప్రదర్శించేవారికి కోరుకున్న వేతనాన్ని ఇచ్చేందుకు సంస్థలు సంకోచించవు.వేతనాన్ని యాచించక, శాసించి పొందే స్థితి ఉండాలని నేటి యువత భావించాలి. మన వేతనాన్ని మనమే డిమాండ్ చేసి పొందేందుకు మనం అలవర్చుకున్న పలు ఆకర్షణీయ నైపుణ్యాలు దోహదపడతాయి.
నైపుణ్యాలను సానబెట్టుకోవాలి
విద్యార్థులు ఉన్నప్పటికీ ఉద్యోగ సాధనకు గట్టి పోటీ ఉంటుందని మనకు తెలుసు. వ్యక్తిగత, శాస్త్ర సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే ఉద్యోగంలో ఎంపికకు, ఎదుగుదలకు ఉపయోగపడతాయి.నిరంతరం నైపుణ్యాలను సానబెట్టుకుంటూ ముందుకు సాగాలి.గెలవాలనే ప్రగాఢ వాంఛలోంచి విజయ ప్రస్థానం ప్రారంభమవుతుంది. మనం ఎంచుకున్న రంగంలో అగ్రస్థానంలోకి దూసుకుపోయే మార్గాలను అన్వేషించుకుంటూ అడుగులు ముందుకు వేయాలి. ప్రతిరోజు కొత్తదనాన్ని కోరుకోవాలి. నేటి ప్రయత్నం విఫలమైనా, అది రేపటి గెలుపుకు పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి.వైఫల్యంలోంచి కసి జనించి, నిరాశ దూరం కావాలి. నైపుణ్యాల్లో నిష్ణాతులయిన వారందరిలో ఆత్మవిశ్వాస నిధి కనిపిస్తుంది. ప్రతి అడుగు, మాట, చేతలో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది.విజేతలందరిలో అంతర్గత, బాహ్య లక్షణాలు విలక్షణంగా ఉంటాయి.ఆత్మసంతృప్తి, సఫలీకృత భావం, మనశ్శాంతి, ఆనందం, భద్రత, ఆత్మవిశ్వాసం లాంటివి అంతర్గత గుర్తింపులు అవుతాయి. వేతన సవరణ, ప్రశంస, ప్రత్యేక గుర్తింపు, ప్రతిష్ఠ, ఆశావహ జీవన విధానం లాంటివి.బాహ్య లక్షణాలుగా వ్యక్తమవుతాయి.
నమ్మకాన్ని చూరగొనాలి!
This story is from the June 18, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 18, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.