మానవజాతి మనుగడలో, పురోగతిలో స్త్రీ, పురు షుల సంగమం అనివార్యమైన ప్రక్రియ అయితే అందుకు ఊపిరిలూదుతున్న వివాహవ్యవస్థ పాత్ర వెలకట్టలేనిదే. మనదేశ సాంప్రదాయ సామాజిక వ్యవస్థకు బలమైన పునాదిగా కొనసాగుతున్న వివాహవ్యవస్థ మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా భావించక తప్పదు.
వేదకాలం నుండి వర్తమానం వరకు మానవ నాగరికత మనుగడకు మూలాధారంగా కొనసాగుతున్న వివాహబంధం ఇరువురి మనుగడకు అవసరమైనప్పటికీ ఈ సంబంధం సృష్టికోసం, దాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం, అడుగడుగునా స్త్రీ అణిగిమణిగి వుండాల్సి రావడమే కాదు, ఆమెతోపాటు ఆమె కుటుంబం కూడా సామాజిక చిన్నచూపుకు, ఆర్థిక దోపిడికి గురికావాల్సి వస్తున్నవైనం శోచనీయమే. నాటి నుండి నేటివరకూ వివిధ వైవాహిక సంబంధిత సాంప్రదాయాల నెపంతో వరుడి కోణంలో ఆలోచించినప్పుడు ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందన్నట్లు, ఓ వివాహం అతని, అతని కుటుంబానికి సంబందించిన సకల ఆర్థిక సమస్యల పరిష్కారానికి మార్గంగా మారుతోందనిపిస్తోంది. భారతదేశంలో వివాహవ్యవస్థ మూలాలలోకి వెళ్లి పరిశీలించినప్పుడు వివాహ సందర్భంగా వధువు తల్లిదండ్రులు తమ కూతురి మంచి కోరుతూ స్వచ్చందంగా తమ ఆర్థికశక్తి అనుమతించిన మేరకు కానుకలు ఇవ్వడం ఓ సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తుంది. ఈ సాంప్రదాయమే ఆచరణలో ఓ భ్రష్టాచారంగా
రూపుదాల్చి వధువు కుటుంబ ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా వరుడితోపాటు, ఆయన కుటుంబం తాలూకు గొంతెమ్మ కోరికలను తీర్చుకునే పైలట్ ప్రాజెక్టుగా మారి
అత్తారింటిలో వధువుపై వరకట్న వేధింపులకు, గృహహింసకూ దారితీస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది. వరకట్నం ఓ సామాజిక దురాచారంగా మారిన క్రమంలో ప్రభుత్వం అనివార్యంగా దానిని కూకటివేళ్లతో పెకిలించడానికి 1960వ సంవత్సరంలోనే వరకట్న నిషేధచట్టాన్ని జారీ చేసింది. ఈ చట్టం ప్రకారం వరకట్నం ఓ భ్రష్టాచారమే. సామాజిక నేరమే. అది తీసుకునే వారు చట్టరీత్యా నేరస్తులే కాదు శిక్షార్హులు కూడానని చెప్పక తప్పదు. ఈ సాంప్రదాయమే వరకట్న పిశాచిగా రూపాంతరం చెంది ఈదేశంలో మహిళలపై పెచ్చుమీరుతున్న అమానవీయ హింసకు సింహభాగం తానే కారణంగా మారుతున్న వైనాన్నిఏఏటికాయేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు తేల్చి చెప్తున్నాయి.ఇంత జరిగినా స్వతంత్ర భారతదేశంలో జారీ చేయబడిన అన్ని చట్టాలలోకెల్లా ఆచరణలో అమలుకు నోచుకోని అగ్రగామి చట్టంగా వరకట్న నిషేధచట్టం అపకీర్తిని మూటగట్టుకొని చేష్టలుడిగి చూస్తోంది.
This story is from the July 23, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 23, 2023 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.