విచ్చలవిడితనానికి అలవాటుపడిన ఒక యువకుడు కర్కోటకు డిగా మారి ఒకరూ ఇద్దరూ ముగ్గురూ నలుగురూ ఐదుగురూ ఆరుగురూ.. ఏకంగా ఆరుగురిని పొట్టన పెట్టుకున్నాడు. ఒక కుటుంబమంతటినీ నమ్మించి వంచించి, వరసబెట్టి అందరినీ పరమదారుణంగా చంపేశాడు!! ఒక్కొక్కరినీ ఒక్కో చోటకు తీసుకెళ్లి ఆ నిండు ప్రాణాల్ని ఘోరాతిఘోరంగా తీసేశాడు. తాడుతో గొంతు బిగించి, రాళ్లూ కట్టెలతో చావచితక్కొట్టి, శవాల్ని పెట్రోల్ పోసి కాల్చేసి 'సీరియల్ కిల్లర్' అయ్యాడు. శవభాగాల్ని వేర్వేరు చోట్ల పడేసి, తప్పించుకు తిరగాలనుకున్నాడు. కానీ.. పాపం పండి పోలీసు బృందాలకు దొరికిపోయాడు. ఇద్దరు పిల్లలు, ఒక దివ్యాంగురాలితో సహా ఆరుగురి ఉసురూ తీసేసిన ఆ నరరూప రాక్షసుడి వయసు పాతికేళ్లలోపే!!! రాస్తుంటేనే, చదువుతుంటేనే, వింటుంటేనే, చెప్తుంటేనే గుండె ఎడాపెడా అరిపోయే ఈ వరుస పరంపర ఖూనీలేమిటి? ఇన్ని నేరాతినేరాలు దాపురించడమేమిటి? ఎందుకిదంతా? యువత అంటే ఘోర నేరాలమయమా.. పైశాచికత్వానికి పర్యాయపదమా....
ఒక్క తెలుగునాటనే కాదు.. మొత్తం అంతటినీ అత్యంత తీవ్ర భయభ్రాంతం చేస్తోంది యువత నేర ప్రవృత్తి! సామాజిక, ఆర్థిక, వాతావరణమంతటినీ పూర్తిగా కలుషిత సాగరంలో ముంచేసి సమస్త మానవత్వానికీ పెనుసవాలు విసురుతోంది.హింసాత్మక, క్రూర కార్యకలాపాలకు ఆ కరడుగట్టిన నేరగాళ్లు పాల్పడటమే కాకుండా అందరి కళ్లూ కప్పేందుకు నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా తెలిసి చేస్తున్నదే.చట్టాన్ని పనిగట్టకుని ధిక్కరించి 'నువ్వా-నేనా' అంటున్న వ్యవహారమే.పాపకృత్యాలకు వారు అంతగా తెగబడుతున్నారంటే నేర పరిశోధక పోలీసు సంస్థతోనే దాగుడుమూతలు ఆడుతున్నారంటే, అసలు సమస్త వ్యవస్థలోనే ఎక్కడో ఏదో లోటూ పాటూ ఉందంటున్నారు.
ఒడిశా మాజీ డీజీపీ జీవ్.టీనేజ్లోనే నేరాల మోరూ జోరూ పెరగడాన్ని సాంఘిక విపత్తు/ఉపద్రవంగా పరిగణించాల్సిందేనని చాటి చెప్తున్నారు. ఆ రాష్ట్రంలో ఒకచోట ఓ కుర్రాడు పదునైన కత్తితో అమ్మాయిని కసితీరాకసాకసా పొడిచి పారేశాడు. వాడిని వలపన్ని పట్టేసిన 3 పోలీస్ ఉన్నతాధికారులతో ఏమన్నాడో తెలుసా? "నేను చేసిందాంట్లో తప్పేముంది? నాకు ఏం జరుగుతుంది?" అని.నేరాల్ని సహించాలా? ఏదైనా ముల్లు గుచ్చుకుంటేనే విలవిల్లాడుతాం. మన చేయి పొరపాటున తగిలితేనే 'సారీ సారీ అంటాం.
This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు