చందమామ కథల్లోని రెక్కల గుర్రంమీదో బాలమిత్ర కథల్లోని హంసనావలోనో తన కలల రాకుమారుడు వస్తాడనీ.. ఊరేగిస్తూ వెంట తీసుకెళతాడనీ..నమ్మడానికి ఎంత బాగుందో వంటి ఊహలతోనే సరిపెట్టుకునేవారు అమ్మాయిలు. కానీ ఈతరం పిల్లలకు ఆ అవసరం "లేదు. ఈ కథలు తెలియకున్నావాటి గురించి కలగనకున్నా ఆ అందమైన ఫెయిరీటేల్స్ ను నిజం చేసి చూపిస్తున్నారు ఈనాటి అమ్మానాన్నలు. అమ్మాయైనా అబ్బాయైనా పుట్టినప్పటి నుంచి పెళ్లి వరకూ రకరకాల వేడుకల్ని తమకు ఉన్నంతలో ఘనంగా చేయాలని ఆరాటపడుతున్నారు నేటితరం తల్లిదండ్రులు. అందుకోసం వేదిక ఎంపిక నుంచి విందు భోజనాల వరకూ తమదైన ప్రత్యేకత కనిపించేలా చేసి అతిథుల్ని చకితుల్ని చేస్తున్నారు.
అందులోనూ వేడుకకు సంబంధించి మిగిలిన తంతులన్నీ ఒకెత్తయితే, వాళ్లను వేదిక మీదకు ప్రవేశపెట్టడం మరొకెత్తు అని చెప్పుకోవాలి.పుట్టినరోజు, ఓణీ/పంచెల పేరంటం, పెళ్లి.. ఇలా ఫంక్షన్ ఏదయినా కావచ్చుగాక తమ గారాల బిడ్డల్ని |రాజసం ఉట్టిపడేలా వాహనాల్లో ఊరేగింపుగా తీసుకురావడం ట్రెండ్గా మారింది.అవునుమరి.. చిన్నారి పుట్టగానే ఇంటిల్లిపాదికీ ఎంత సంబరం.. ఆ ఆనందాన్ని పదిమందికీ పంచుతూ చేసేవే బారసాల, అన్నప్రాసన.. వంటి వేడుకలన్ని. ఇవన్నీ ఎలాగున్నా మొదటి పుట్టినరోజు గ్రాండ్గా సంప్రదాయంగా మారింది. అందులోనూ కొత్తదనం కోసం ఈమధ్య పూలతో అలంకరించిన చక్రాల బండ్లూ కార్లూ గుర్రాలున్న చిట్టి రథాల్లో బుజ్జాయిల్ని వేదిక దగ్గరకు తీసుకొస్తున్నారు.
This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 07, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు