అన్ని రోజుల్లాగే ఆ రోజు కూడా.....అనుకున్న అతనికి, తన జీవితం ఒక మలుపు తిరగబోతోందని అప్పుడు తెలీదు.
"మా వాడు అసలు చదవటం లేదు సారూ! నేను, మా ఆడమనిషి వాడిని కొట్టినా తిట్టినా కూడా మాట వినటం లేదు. మీరు డ్యూటీ నుంచి వచ్చాక కాస్త శ్రమ తీసుకుని వాడికి చదువు చెప్పండి " అని బతిమాలుతున్నాడు నర్సయ్య..
“నేను ఇంటిదగ్గర ఎవరికీ ప్రైవేట్లు చెప్పను నర్సయ్యా, బడిలో రోజంతా పిల్లల్తో వారి వారి ఇంటికొచ్చాక కూడా అదే పని మళ్లీ చెయ్యాలంటే నా వల్ల కాదు" అంటున్న వేణుమాధవ్ నోటమాట పూర్తయ్యిందో లేదో అన్నంత పనీ చేసేసాడు.
ఒక్క ఉదుటున వచ్చి అతని పాదాలు రెండూ పట్టుకొని బతిమాలసాగాడు.
"అంత మాట అనకండి సార్. చిన్నప్పుడు బడికిపోయి చదువుకోవాలని నాకు చాలా అనిపించేది. మా అయ్య మాత్రం సత్తే ఈల్లేదని చెప్పాడు. మాలా కాకుండా, వీడయినా చదువుకుంటాడని ఆశపడ్డాను. హు... ఆ దేముడు ఇదే రాసాడు కాబోలు.. మా ఆడది ఒకటే ఏడుపు.. అప్పుడే అనుకున్నా.. ఎంత కష్టపడయినా బిడ్డని చదివించాలని. వాడు ఇప్పుడు కనుక దారిలోకి రాకపోతే ఎందుకూ పనికి రాకుండా పోతాడు" అని బతిమాలుతుంటే మధ్యలోనే అందుకున్న సుధ “వాడిని చదివించే బాధ్యత మాది. నువ్వు ధైర్యంగా ఉంటు" అని నర్సయ్యకు చెప్పింది.
చిన్నప్పట్నుండీ పెరిగిన వాతావరణం ప్రభావం వల్లనో, చదివిన సాహిత్య ప్రభావం వల్లనోగానీ ఈ ప్రపంచాన్ని మార్చెయాలన్నంత ఆవేశం, మార్చివేయగలనన్న ఆత్మవిశ్వాసం రెండూ గుండె నిండా నింపుకున్న నిర్ణయంతో
“సరేలే.. ఎలాగోలా వీలు చూసుకొని చదువు చెప్తాను" అని హామీ ఇచ్చాడు వేణు, నర్సయ్యకు.
“మీరు కలకాలం చల్లగా ఉండాలి" అన్నాడు మళ్లీ దండం పెడుతూ.
ఒకలాంటి విషాదం... పైగా అదో రకమైన ముసలివాసన, ఆలనా పాలనా పట్టించుకునేవాళ్లు లేక శరీరం మీద శ్రద్ధ పోయి ఏ పని చేయడానికి కూడా సహకరించని దుర్భలత్వం తాలూకు ముసలి వాసన అది. ఎప్పుడూ ట్రిమా స్టైలిష్గా ఉండే ఆవిడని ఇలా చూస్తూంటే బాధగా వుంది చిరంజీవికి.
అంత ఖరీదయిన సోఫాలో ఉన్న ఆ మనిషి రసికారుతున్న పుండులా అసహ్యంగా, వికారంగా ఉంది.
అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన భార్యా, కూతురు ఆ ఆకారాన్ని నమ్మలేనట్టుగా చూసారు. చలికి ముడుచుకుపోయి సోఫాలో ఒక మూల ఒరిగిపోయి ఉంది ఆమె.
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలుగుదారులు
తెలుగుదారులు
సలాం.. సైనికా..
సలాం.. సైనికా..
యశస్విని కావాలి
యశస్విని కావాలి
'మహా'కుంబ్' లో జనగంగ
పౌరాణిక ప్రాముఖ్యత గల కుంభం సముద్ర మథనానంతరం లభించిన అమృత భాండం ప్రధానంగా జరిగిన విషయం.
ఆర్థిక మహర్షి మన్మోహన్
దేశం అప్పటికే చాలా క్లిష్ట పరిస్థితిలోకి జారిపోయింది.దాదాపు 100 కోట్ల సభ్యులున్న అతిపెద్ద భారత కుటుంబం.
'సంఘ్' భావం
చర్చకు అవకాశం లేని చట్టసభల సమావేశాలు
పుష్ప విలాసం!
హిమాలయాల్లోని సుందర ప్రకృతి దృశ్యాల మధ్య ఉండే కొన్ని పుష్పాలు మనల్ని పలకరిస్తుంటాయి.
తాజా వార్తలు
బిపి అదుపులో ఉండాలంటే..
త్రివిక్రమ్ బన్నీ మరో సినిమా
త్రివిక్రమ్ తో మూడు సినిమాలు చేసిన బన్నీసినిమాకి జరుగుతున్న సన్నా హాలు హీరోయిన్గా తెరపైకి మీనాక్షి చౌదరి పేరు రీసెంటుగా లక్కీ భాస్కర్తో హిట్ కొట్టిన బ్యూటీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందనే టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది.
తారాతీరం
'భూత్ బంగ్లా'లో టబు