ఆది దంపతులైన శివ పార్వతుల ప్రియపుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన భారతదేశంలోనే కాదు పొరుగు దేశాలైన శ్రీలంక, మలేషియా, సింగపూర్, మారిషస్లతో పాటు తమిళ ప్రజలు ఎక్కడ అధిక సంఖ్యలో ఉంటారో అక తప్పకుండా శ్రీ షణ్ముఖునికి ఒక ఆలయం తప్పకుండా ఉంటుంది.
శ్రీ సుబ్రహ్మణ్య ఆరాధన తమిళనాడులో ప్రాధాత్యత కలిగి వుంది.కారణం ఏమిటంటే పురాతన తమిళ గ్రంథాలు తగిన వివరణ ఇస్తున్నాయి.శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు 'మురుగ (క)' అని సంభోదిస్తారు.
ఈ మూడు అక్షరాలు త్రిమూర్తులకు సంకేతం. 'ము' అనగా శ్రీ మహావిష్ణువు మరో పేరైన ముకుందుడు అన్నదానికి, ''క' అంటే కమలాసనుడు బ్రహ్మకు సంకేతాలని పురాతన తమిళ గ్రంథాలు తెలుపుతున్నాయి. మురుగ అంటే స్ఫురద్రూపి, దైవత్వం, యువకుడు, మూర్తీభవించిన మగతనానికి నిదర్శనం అన్న అర్థాలు ఉన్నాయి అని అంటారు.
స్వామి మరో పేరు షణ్ముఖ లేక ఆర్ముగం.. అంటే ఆరు ముఖాలు కలిగినవాడు అని ఆరు ముఖాలు పంచేంద్రియాలకు, మనస్సుకు సంకేతాలు. వాటి మధ్య ఉండే సత్సంబంధం, జ్ఞాన సముపార్జనకు మార్గం సుగమం చేస్తుంది.
వేలాయుధన్ అంటే (శూలం)ని ఆయుధంగా ధరించినవాడు, అజ్ఞానాన్ని తొలగించేవాడు అని కూడా చెబుతారు.
ఇలా స్వామివారి నామాలకు అనేక ప్రత్యేకతలు, విశేష అర్థాలు ఉన్నాయి.అంతేకాకుండా శ్రీ షణ్ముఖుని ఆదేశం మేరకు అగస్త్య మహర్షి పొదిగై పర్వత గుహలో ఉండి సంస్కృతంతో పాటు తమిళ భాషకు అంకురార్పణ చేశారని కూడా ఆ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
ఆరు పాడై వీడుగా ప్రసిద్దికెక్కిన ఆరు ముఖ్య ఆలయాలతో పాటు మరెన్నో విశేష ఆలయాలు కార్తికేయునికి తమిళనాట ఉన్నాయి.
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది.తెలుగు రాష్ట్రాల్లోనూ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండటం దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వీటిల్లో కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రం అగ్రస్థానంలో ఉంలో ఎలాంటి సందేహం లేదు.
స్వామి ఇక్కడ స్వయంభూగా అవతరించారు అని క్షేత్రగాథ తెలియచేస్తోంది.
క్షేత్ర గాథ
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 17, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.