రామప్ప దేవాలయం
ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక ఆలయం రామప్ప దేవాలయం. ఇది శివాలయం. 'రామప్ప' అంటే ఈ ఆలయంలో దైవం పేరు కాదు. ఈ ఆలయాన్ని అద్భుత కళాఖండంగా మలచిన ప్రధాన శిల్పి పేరు. శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో నెలకొని ఉంది. వరంగల్లుకు 70 కి.మీ. దూరంలో ఉందీ ఆలయం. అపురూప కట్టడంగా ప్రపంచ ప్రసిద్ధి పొందిన రామప్ప అణువణువునా ప్రత్యేకతలతో, అద్భుత శిల్ప కళా నైపుణ్యంతో కాకతీయుల ఘనకీర్తిని చాటి చెబుతుంది. రామప్ప ఆలయ గోపురం నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు నీళ్లల్లో వేస్తే తేలుతాయనేది పరిశీలకుల వాదన. శాండ్ బేస్డ్ టెక్నాలజీతో, భూకంపాలను తట్టుకునేలా, ఇసుక పునాదులపై నీళ్లపై తేలియాడే బరువులేని ఇటుకలతో నిర్మించిన కట్టడం రామప్ప ఆలయం. ఏనుగు పేడ, తవుడు, కరక్కాయ, చెట్ల జిగురుతో ఇటుకల తయారీ చేసినట్లు తెలుస్తోంది.ఇక్కడ ఒకే రాయిలో మూడు రంగులు కలిగి వుండడం ప్రధానమైన అంశం. ఈ ఆలయంలో శిల్పకళ విశిష్టతను తెలిపే మరో అద్భుతం సప్తస్వరాలు పలికే శిల్పం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ఉండే శిల్పాన్ని వేళ్లతో మీటితే సరిగమపదనిసలు పలుకుతుంది. రామప్ప దేవాలయానికి యునెస్కోవారి గుర్తింపు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించి విశ్వఖ్యాతినార్జించింది.
ముడుమాల నిలువురాళ్లు
This story is from the May 26, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 26, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు