ప్రస్తుతం అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జులైలో పెద్దగా వర్షాలు కురవలేదు కానీ, ఆగస్టు నెల నుంచి వర్షాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది వర్షాకాలం కాబట్టి వర్షాలు కురుస్తాయి. అయితే వర్షాలకు తోడు అల్ప పీడన ప్రభావంతో గత కొన్నిరోజులుగా కావాల్సిన దానికంటే అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లోను, తెలంగాణలో కొన్ని జిల్లాలో విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో అధిక వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనంతో ఇంకా వర్షాలు భారీ నుంచి అతిభారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటిస్తున్నది. అధిక వర్షాలు, చల్లటి వాతావరణం వల్ల టువ్యాధులు, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి.ఇన్ఫ్లుయెంజా, రైనోవైరస్, డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, చికెన్ గున్యా వైరస్, ఎబోలా వైరస్, జికా వైరస్, వెస్ట్నెల్ వైరస్‌లతో రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు.అసుపత్రులు జ్వరాల రోగులతో నిండిపోతున్నాయి.ప్రత్యేకంగా చంటిపిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ వ్యాధిబారిన పడుతున్నారు. అంటురోగాలు కూడా విస్తరిస్తు న్నాయి. ఈ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.లేకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. జ్వరాలు, వాటి రకాలు, వ్యాధికి కారణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.
వైరస్లు కంటికి కనిపించని సూక్ష్మజీవులు. భూమిపై 380 (ట్రిలియన్స్ దాకా వైరస్‌లున్నాయి. వాటిలో దాదాపు వెయ్యి రకాల వైరస్లు మనుషుల్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి. వీటినే హ్యుమన్ వైరస్లు అంటారని డాక్టర్ షాపిరా తెలిపారు. మొదట 1892లో రష్యా సైంటిస్ట్ అయిన డెమిట్రీ ఐవాన్స్కీ వైరస్ల్నిప్రత్యేకమైన సూక్ష్మజీవులుగా గుర్తించారు. వీటికి మార్టిన్స్ బైజిరిక్ 'వైరస్' అని పేరు పెట్టారు. వైరస్ అనేది లాటిన్ పదం. దీని అర్థం తేలికైన విషం. వైరస్ల గురించిన శాస్త్రాన్ని 'వైరాలజీ' అంటారు. 1931లో జర్మనీ సైంటిస్ట్ అయిన ఎర్నస్ట్ రస్కా, మాక్స్ నోల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా వైరస్ల సైజ్ (20ఎమ్ -750ఎన్ఎమ్) వైరస్ల ఆకారం(రాడ్స్ - జంతువుల వైరస్, ఫిలమెంట్స్ - మొక్కల వైరస్, గుండ్రంగా - హ్యుమన్ వైరస్), వైరస్ల నిర్మాణం, పనితీరుని గుర్తించారు.
This story is from the September 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 15, 2024 edition of Vaartha-Sunday Magazine.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్‌గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్‌ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.