ఆత్మలు తమ ఆధ్యాత్మిక యాత్రలో ముందుకు పురోగమించడానికి ఏ కుటుంబంలో జన్మించాలి అన్న విషయాన్ని ఎంపిక చేసుకుంటాయని చెప్పబడింది. కాబట్టి ప్రణాళికా రహిత పిల్లల పెంపకం ఉండొచ్చేమో గానీ, ప్రణాళికా రహిత గర్భాధారణ మాత్రం ఉండదని మనం అనుకోవచ్చు. ప్రణాళికా బద్దమైనా, ప్రణాళికా రహితమైనా, ఒక బిడ్డ పుడితే, ఆ ఆత్మకు సంరక్షకులుగా మారడం అనేది తల్లిదండ్రులకు ఒక వరం. విశ్వాసం మరియు ప్రేమ అనే పునాదులపై నిర్మించాల్సిన ఒక బాధ్యతగా ఆ ఆశీర్వాదాన్ని మార్చుకోవాలి.
పిల్లల పెంపకం అనేది సర్వ సాధారణమైనదిగా అనిపించవచ్చు. కానీ ఇది ఒక ప్రత్యేక అవకాశం. చాలామంది దీనిని అనుభూతి చెందలేకపోతున్నారు. దైనందిన జీవితంలోని అన్ని రకాల అదనపు ఒత్తిళ్లతో ఎక్కువమంది జంటలకు గర్భం దాల్చడం ఒక సవాలుగా మారిపోయింది. దీనికితోడు, తమ కుటుంబం పేరు, ఆచారాలు, మత సాంప్రదాయాలు, బోధనలు మరియు వివిధ ఆర్థిక స్థితులు కొనసాగింపబడాలని వారిపై కుటుంబాలనుండి ఒత్తిడి కూడా ఉంటుంది. గతంలో, తల్లి పూర్తి సమయం ఇంట్లోనే ఉండడం, బిడ్డ జీవితంలోని ప్రతి ముఖ్యమైన సంఘటనను గమనించడం, అలాగే తండ్రి ఆ కుటుంబాన్ని పోషించే మూలవ్యక్తిగా ఉండడం ఒక వరంగా ఉండేది. నేడు ఎక్కువ ఆర్ధిక అవసరాలు తీరడానికి తల్లిదండ్రులిద్దరూ బలవంతంగా పని చేయవలసిన అవసరం ఏర్పడింది. ఇది సంరక్షకులు, ఉపాధ్యాయులు సులభంగా పూర్తి చేయలేని ఒక శూన్యతను సృష్టిస్తోంది.
This story is from the January 2024 edition of Heartfulness Magazine Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 2024 edition of Heartfulness Magazine Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In