బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
Sri Ramakrishna Prabha|May 2024
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం

బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది. భక్తితో ఏదైనా దేవాలయంలో ప్రవేశించి దేవతాప్రతిమకు మ్రొక్కితే ఆ క్షణంలోనే ఆ విగ్రహం భల్లున పగిలిపోయేది. ఇలా కొన్నిసార్లు జరిగాక దేవాలయాలకు వెళ్ళడం మానుకొన్నాడు. తొలిసారి బుద్ధుణ్ణి చూసినపుడు అతని హృదయం భక్తి, గౌరవం, శ్రద్ధలతో పరవశించింది. చేతులు జోడించి నమస్కరించాలనుకొన్నాడు. నమస్కరిస్తే ఈయనకూ, దేవతా విగ్రహాలకు అయినట్లే రూపనాశనం అయిపోతుందేమో అని సంశయించి నమస్కరించలేదు. అంతట బుద్ధుడు "కాశ్యపా! సంశయించకు, తథాగతునికి నమస్కరించు” అన్నాడు. కాశ్యపుడు నమస్కరించాడు. బుద్ధునికి ఏమీ కాలేదు. 'బుద్ధం శరణం గచ్ఛామి' అని కాశ్యపుడు సాష్టాంగ నమస్కారం చేసి, 'ఇకనుంచి మీరే నా ఆచార్యులు' అన్నాడు.

"బహుజన హితం కోసం, బహుజన సుఖం కోసం నీవు అన్ని దిక్కులకూ వెళ్ళు. ధర్మాన్ని ప్రజలకు తెలియజేయి” అని బుద్ధుడు కాశ్యపునికి ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రేరణతో కాశ్యపుడు జీవితాన్నంతా పర్యటనలోనే గడిపాడు. ఒకసారి కాశ్యపుడు జీవితాన్నంతా పర్యటనలోనే గడిపాడు. ఒకసారి కాశ్యపుడు మగధలో పర్యటిస్తుండగా అతనికి కుమారజీవుడు శిష్యుడయ్యాడు. బుద్ధ శాసనాన్ని అతనికి సాకల్యంగా చెప్పి, “నాయనా! నీవు అదృష్టవంతుడివి.క్షణసంపత్ పుష్కలంగా కలిగివున్నావు.మనుష్యజన్మ విలువ అంతా ఇంతా కాదు.అందులోనూ యువకుడిగా ఉన్నావు. అవికలేంద్రియుడవు గానూ ఉన్నావు. తథాగత శాసనాన్ని విన్న భాగ్యమూ పొందావు. ఆర్య ప్రోతస్సు(ధర్మమార్గం)లో ప్రవేశించావు.దానిలో అలాతేలియాడుతూ ఉంటే నిన్ను సాగరానికి చేర్చుతుంది. వెళ్ళు నాయనా!

నీవెక్కడున్నా అష్ట లోకధర్మాలు (లాభం-అలాభం, యశస్సుఅయశస్సు, ప్రశంస-నింద, సుఖం-దుఃఖం) నిన్నంటకుండా చూసుకో! బురదగుంటలో ఉన్నా బురద అంటని కమలంలాగా జీవించు. అష్ట లోకధర్మాలలో ఒకదానికి కృంగిపోయి, మరోదానికి పొంగిపోకుండా చిత్తంలో ఉపేక్షా (సమంతా) సంపదను పెంచుకొంటూ ఉండు" అని హితబోధ చేసి పంపాడు.

This story is from the May 2024 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the May 2024 edition of Sri Ramakrishna Prabha.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SRI RAMAKRISHNA PRABHAView All
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
Sri Ramakrishna Prabha

సింహాద్రి అప్పన్న చందనోత్సవం

వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!

time-read
1 min  |
May 2024
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
Sri Ramakrishna Prabha

శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం

ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్‌ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.

time-read
1 min  |
May 2024
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
Sri Ramakrishna Prabha

ధర్మపరిరక్షకుడు ఆనందుడు

చిత్రాలు : ఇలయభారతి  అనుసృజన : స్వామి జ్ఞానదానంద

time-read
2 mins  |
May 2024
సమతామూర్తి సందేశం
Sri Ramakrishna Prabha

సమతామూర్తి సందేశం

బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.

time-read
1 min  |
May 2024
బంధాలు.. బంధుత్వాలు -
Sri Ramakrishna Prabha

బంధాలు.. బంధుత్వాలు -

తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.

time-read
2 mins  |
May 2024
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
Sri Ramakrishna Prabha

బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం

బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.

time-read
3 mins  |
May 2024
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
Sri Ramakrishna Prabha

అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?

నేటి బేతాళ ప్రశ్నలు

time-read
1 min  |
May 2024
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
Sri Ramakrishna Prabha

వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!

ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.

time-read
4 mins  |
May 2024
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
Sri Ramakrishna Prabha

.వాళ్ళు నలిగిపోతున్నారు! . .

పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.

time-read
3 mins  |
May 2024
వికాసమే జీవనం!
Sri Ramakrishna Prabha

వికాసమే జీవనం!

ధీరవాణి - స్వామి వివేకానంద

time-read
1 min  |
May 2024