అందాన్ని మాత్రమే నమ్ముకొని సినీ తారగా ఎదగాలనుకునే అమ్మా యిలు చాలామంది ఉంటారు.కానీ కేతికా శర్మ అందాన్ని, అభినయాన్ని, ఆత్మ విశ్వాసాన్ని మూడింటిని రంగరించి వ్యక్తిత్వంలో నింపుకోవటంతో టాలీవుడ్లో మూడేళ్ల కెరీర్లోనే మూడు చిత్రాలతో మరికొన్ని ఆఫర్లతో దూసుకుపోతున్నారు.పుట్టి పెరిగింది ఢిల్లీలోనే, కానీ శ్రద్ధగా తెలుగు నేర్చుకొని అవకాశం దొరికితే తన మాటలు, పాటలు తానే చెప్పుకోవాలని, పాడాలని తపిస్తూ ఉంటారు ఈ యంగ్ బ్యూటీ ఐకాన్. తెలుగులో రొమాంటిక్ చిత్రంతో కెరీర్ మొదలు పెట్టి 'లక్ష్యం', 'రంగ రంగ వైభవంగా' తదితర చిత్రాల్లో నటించి యువతరంలో ప్రత్యేక మైన గుర్తింపును, క్రేజ్‌ను సంపాదించుకున్నారు. డిగ్రీ చదివి మోడలింగ్‌లో చేరి అక్కడి నుంచి హీరోయిన్గా మారి క్రమంగా బాలీవుడ్ దాకా ఎదగాలని ఆశిస్తోన్న హీరోయిన్ కేతికా శర్మ ఇంటర్వ్యూ విశేషాలివి....
మీ కు అనేక అంశాల్లో ప్రతిభ ఉంది. కానీ ముఖ్యంగా ఇష్టపడేది ఏది?
నేను సోషల్ మీడియాలో అడుగుపెట్టి టిక్‌టాక్, యూట్యూబ్ ద్వారా లక్షల్లో అభిమానులను సంపాదించుకున్నాను.టాలీవుడ్లో అడుగు పెట్టాక తెలుగు నేర్చు కోవటంతో డబ్బింగ్, సింగింగికి మొదటి సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే నేనేమి పూర్తి స్థాయి సింగర్‌ని కాదు. ఇప్పుడు నా దృష్టంతా హీరోయిన్గా కెరీర్ నిలబెట్టుకోవటమే.
అసలు హీరోయిన్ అవ్వాలని ఎందుకనిపించింది?
హీరోయిన్ కావాలని చిన్నప్పుడే అనుకున్నాను. మా పేరెంట్స్ డాక్టర్స్ కనుక వారు అప్పు డప్పుడు బ్రేక్, సరదా కోసం నన్ను కూడా విహా రానికి, సినిమాలకు తీసుకెళ్లేవారు. థియేటర్లో నటీ నటులను చూసి నాకు ఎన్నో ఎమోషన్స్ కలిగేవి. భావోద్వేగానికి గురయ్యేదాన్ని. అమ్మా...వాళ్లలాగా కావాలంటే ఏం చేయాలి అని మమ్మీని అడిగితే నటనారంగం గురించి వివరంగా చెప్పారు. అప్పట్నుంచి హీరోయిన్ కావాలని గట్టిగా నిర్ణయించుకున్నాను.
కొత్త కొత్తగా కెమేరా ముందుకు వచ్చి నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి?
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.