తల్లిపాలకు సంబంధించిన భ్రమలు తొలగించుకోడానికి ఈ విషయాలను తప్పక చదవండి.
మాతృత్వం మహిళలకు అన్నింటికంటే ముఖ్యమైనది. కానీ బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది మహిళలు మా శిశువుకి పాలు ఇవ్వడానికి భయపడతారు. తల్లి పాలు ఇస్తే తమ శరీర ఆకారం చెడిపోతుందని భావిస్తారు. కానీ ఇది కేవలం భ్రమ.
పాలివ్వటం తల్లికి, బిడ్డకి లాభదాయకమైనది. పాలు ఇస్తే తల్లికి శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.పిల్లల సరైన వికాసానికి తగినంత పోషణ అందుతుంది. ఇవి పిల్లల శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
బిడ్డకు తల్లిపాలు ఎందుకు అవసరమో డాక్టర్ సుష్మ (గైనకాలజిస్టు)తో తెలుసుకుందాం.
బిడ్డకు తల్లిపాల ఆవశ్యకత
బిడ్డకు తల్లిపాలు చాలా ముఖ్యం. బ్రెస్ట్ ఫీడింగ్ లేదా తల్లిపాలు బిడ్డకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన ఆహారం. పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధుల నుంచి బిడ్డను రక్షిస్తాయి.
బిడ్డ పుట్టిన గంటలోపు తల్లి పాలు ఇవ్వాలి.ఆ తర్వాత మొదటి 6 నెలలు ప్రత్యేకంగా బిడ్డకు పాలు పట్టాలి. నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకు అంటే ప్రీ మెచ్యూర్ బేబీలకు పాలు ఎంతో మేలు చేస్తాయి. బిడ్డ పుట్టిన తర్వాత తల్లి స్తనం నుంచి చిక్కని పసుపురంగు పదార్థం బయటికి వస్తుంది. దీనిని కొలోస్ట్రమ్ అంటారు.ఇది పిల్లలకు అవసరమైన పోషకాలు అందించి వారిలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం పెంచు తుంది. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
బిడ్డకు ఎందుకు లాభదాయకం
• తల్లిపాలు బిడ్డకు యాంటీ బాడీలుగా పని చేస్తాయి. బిడ్డ పుట్టిన ఆరు నెలల వరకు తల్లిపాలు చాలా అవసరం. పిల్లల్లో న్యుమోనియా, డయేరియా లాంటి వ్యాధుల బారిన పడకుండా చాలావరకు రక్షిస్తాయి.
• బిడ్డ పుట్టినది మొదలు రోజుల వరకు తల్లి స్తనాల నుంచి వెలువడే పసుపు రంగు పాలు (కొలోస్ట్రమ్)తో బిడ్డకు తాగించరు.మూఢ నమ్మకాల కారణంగా వీటిని చెడు పాలుగా భావిస్తారు. డాక్టర్ సుష్మ మాట్లాడుతూ కొలోస్ట్రమ్ పిల్లలకు ఎంతో లాభమని, ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించే తత్వాలు కలిగి ఉందని చెప్పారు. ఇందులో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది.
• తల్లిపాలు మంచి జీర్ణకారి. బిడ్డకు ఇవి సులభంగా జీర్ణమవుతాయి.
• పిల్లల మెదడు అభివృద్ధి చెందడంలో తల్లి పాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. వారిలో మేధో సామర్థ్యం పెరుగుతుంది.
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 2023 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు