ఇమ్యూనిటీ పెంచే సులువైన చిట్కాలు
Grihshobha - Telugu|January 2024
చలికాలంలో మీతోపాటు కుటుంబ సభ్యుల్లోనూ ఇలా రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధుల నుంచి బయటపడవచ్చు.
-గరిమాపంకజ్
ఇమ్యూనిటీ పెంచే సులువైన చిట్కాలు

శీతాకాలంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. ఈ సీజన్లో కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఈ కాలంలో గాలిలోని చల్లదనం శరీరం పని సామ ర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో బలమైన ఇమ్యూనిటీ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

రోగనిరోధక శక్తి అంటే ఏమిటి?

నిజానికి ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్లతో పోరాడే ఒక శక్తి శరీరంలో టాక్సిన్లు ఏర్పడడానికి బ్యాక్టీరియా, వైరస్ లేదా హానికారక పరాన్న జీవులు లాంటివి కారణాలు కావచ్చు. శరీరం చుట్టూ రకరకాల బ్యాక్టీరియా, వైరస్లు ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో వ్యాధులను గురి చేస్తాయి. వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలు సైతం మనల్ని ఇబ్బంది పెడతాయి.

బయటి నుంచి వచ్చే ఈ అంటువ్యాధులు, కాలుష్య సమస్యలు, వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడానికి రోగనిరోధక వ్యవస్థ లేదా రోగనిరోధక శక్తి ఉంటుంది. మీలో ఇది బలంగా ఉంటేనే మారుతున్న వాతావరణం, కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల నుంచి బయటపడతారు.రోగనిరోధక శక్తిని బలోపితం చేసే మార్గాల గురించి తెలుసుకుందాం.

శారీరక చురుకుదనం ముఖ్యం

మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి మీ రోగనిరోధక శక్తిని పెంచుకోడానికి శరీరం చురుగ్గా ఉండటం తప్పనిసరి. శారీరక శ్రమతో ఎండార్ఫిన్ అనే హార్మోను విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని దూరం చేసి మనసును సంతోషంగా ఉంచుతుంది.శారీరక సామర్థ్యాన్ని పెంచుతుంది. పని చేయకుండా, ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటే ఉదర సంబంధిత వ్యాధులకు గురవుతారు. శరీరం చురుగ్గా లేకపోతే అది మీ శరీర రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. దీన్ని నివారించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ దినచర్యలో భాగంగా చేసుకోండి.

వ్యాయామం చేస్తే మీ స్టామినా పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగు పడుతుంది. నియమిత వ్యాయామంతో ఊబకాయం, టైప్-2 మధుమేహం, గుండె జబ్బులు, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు లాంటి దీర్ఘకాల వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామంలో యోగా, సైక్లింగ్తోపాటు వాకింగ్ను చేర్చండి. వయసు పైబడిన పెద్ద వాళ్లు వారానికి కనీసం రెండున్నర గంటలు మీడియం ఇంటెన్సిటీ వ్యాయామం చేయాలి.

This story is from the January 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 2024 edition of Grihshobha - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - TELUGUView All
గ్లామరస్ ఫ్యాషన్
Grihshobha - Telugu

గ్లామరస్ ఫ్యాషన్

జార్జెట్ రూబీ రెడ్ గోల్డ్ ప్రింటెడ్ అనార్కలీ సెట్... దానిపై హెవీ జరీ, సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ.

time-read
1 min  |
November 2024
దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు
Grihshobha - Telugu

దీపావళి బహుమతిగా బడ్జెట్ ఫ్రెండ్లీ మొక్కలు

దీపావళి పండుగ సందర్భంలో బహుమతులను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ.

time-read
2 mins  |
November 2024
ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్
Grihshobha - Telugu

ఎథ్నిక్ దుస్తులకు వెసన్ టచ్

పండుగ సీజన్లో కొనుగోలు చేసే దుస్తులు ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్గా మారవు. ఇదెలా సాధ్యం....?

time-read
3 mins  |
November 2024
7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా
Grihshobha - Telugu

7 ఆరోగ్య సమస్యల నుంచి రక్షించే ఆల్బుకారా

మీరు తీసుకునే ఆహారంలో ఆలుకారాలను చేరిస్తే అద్భుతమైన లాభాలను పొందుతారు.

time-read
1 min  |
November 2024
స్లీప్ టూరిజం అంటే ఏమిటి?
Grihshobha - Telugu

స్లీప్ టూరిజం అంటే ఏమిటి?

ప్రస్తుతం స్లీప్ టూరిజం ట్రెండ్ నడుస్తోంది. స్లీప్ టూరిజం అంటే ఏమిటి? దానివల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

time-read
2 mins  |
November 2024
డాక్టరు సలహాలు
Grihshobha - Telugu

డాక్టరు సలహాలు

డాక్టరు సలహాలు

time-read
2 mins  |
November 2024
దీపావళి తీపి వంటలు
Grihshobha - Telugu

దీపావళి తీపి వంటలు

దీపావళి తీపి వంటలు

time-read
2 mins  |
November 2024
జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్
Grihshobha - Telugu

జీవం లేని జుట్టు కోసం 5 హెయిర్ ప్యాక్స్

కేశ సౌందర్యాన్ని నిలిపి ఉంచుకునేందుకుఈ 5 హెయిర్ ప్యాక్స్ అద్భుతంగా పనిచేస్తాయి.

time-read
1 min  |
November 2024
అందమైన వక్షోజాలకు 11 మార్గాలు
Grihshobha - Telugu

అందమైన వక్షోజాలకు 11 మార్గాలు

మీ అందాన్ని మరింత పెంచుకోవడానికి ఆకర్షణీయమైన వక్షోజాల కోసం ఈ చిట్కాలు మ పాటించండి.

time-read
2 mins  |
November 2024
మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?
Grihshobha - Telugu

మీరు కూడా 66 “ఫోమో” బాధితులేనా?

మీరు కూడా సోషల్ మీడియాలో ఏదైనా అప్లోడ్ చేసి, లైక్లు, కామెంట్లను పొందాలని తహతహ లాడుతున్నట్లయితే, ఇది మీ కోసమే...

time-read
3 mins  |
November 2024