ఇప్పటికీ వ్యక్తులు అమ్మాయి బ్రా స్ట్రాప్ చూసి ఏదో తెలియని అసౌకర్యానికి లోనవు తుంటారు.ఇది ఒక జోక్ గానూ మారు తుంది.అసలు ప్రశ్న ఏంటంటే, ఒక వ్యక్తి తన బనియన్ని పబ్లిక్ గా ఎక్కడైనా ఆరబెట్ట గలిగినప్పుడు స్త్రీ బ్రాని స్త్రీ ఎందుకు అలా చేయలేదు? అదొక 'పరిశోధనాంశం'గా ఎందుకు మారుతుంది? వ దులుగా మారి వేలాడే స్తనాలు వికారంగా కనిపిస్తాయి. సాధారణంగా ఇది వృద్ధాప్యంలో జరుగుతుంది. కొన్నిసార్లు ఇది చిన్న వయసులోనూ కనిపిస్తుంది.దీనికి కారణం వాళ్లు బ్రా ధరించక పోవడమే.
వదులుగా, వేలాడే స్తనాలు అస్సలు ఆకర్షణీయంగా ఉండవు. కానీ రోజంతా బ్రా ధరించి ఉండటమంటే అంత తేలిక కాదు అన్నదీ కాదనలేం.
బ్రా కి సంబంధించి తన అనుభవాన్ని 24 సంవత్సరాల రాధిక వివరిస్తూ “నాకు మొదట్లో బ్రా ధరించడం అస్సలు ఇష్టం ఉండకపోయేది.టీనేజీలో మా అమ్మ నన్ను బ్రా వేసుకోమని చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. నా శరీరంపై మరొక భారం వేయొద్దు అనుకున్నాను.కానీ నా శరీరంలో వివిధ మార్పులు జరగసాగాయి.స్తనాలు బయటికి కనిపించసాగాయి. దాంతో నేను బ్రా ధరించాల్సి వచ్చింది” అని చెప్పింది.
"కానీ బ్రా ధరించడం అంత సులభమైన విషయం కాదు. బ్రా వేసుకున్నాక నన్ను కట్టేసినట్లు అనిపించింది. కానీ క్రమంగా అది అలవాటైంది. ఇప్పుడు నేను బ్రా వేసుకోపోతే నాకు వింతగా, ఏదో ఖాళీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది” అని చెప్పింది.
సొంత ఎంపిక ఉండాలి
కంఫర్ట్ విషయాన్ని ప్రస్తావిస్తూ రాధిక “మొదట్లో ఇది అస్సలు సౌకర్యంగా ఉండకపోయేది. ఊపిరి తీసుకోవడంలో క ఇబ్బంది ఏర్పడేది. తరచుగా బ్రా స్ట్రాప్ గుర్తులు పడేవి. వేసవి కాలంలో ఈ సమస్యలు మరింత పెరిగేవి. చెమట పట్టడం, బ్రెస్ట్ దాని చుట్టుపక్కల దురద లాంటివి ఏర్పడేవి".
"అంతేకాదు, ఎన్నోసార్లు బ్రా వల్ల రాషెస్ వచ్చేవి. ఇవన్నీ ఉన్నప్పటికీ, బ్రెస్ట్ సరైన స్థితిలో ఉండాలంటే బ్రా తప్పనిసరి. దీంతో బ్రెస్ట్ సరిగ్గా, బిగుతుగా ఉంటుంది. వంగి పనులు చేస్తున్నప్పుడు బ్రెస్ట్స్ బయటికి రావు. వికారంగానూ కనిపించదు.దీన్ని ధరించినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నేను బ్రా వాడుతాను కానీ దీన్ని రోజంతా వేసుకోలేను. అందుకే రాత్రిపూట తీసేసి పడుకుంటాను" అని చెప్పింది.
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.