దాంతో పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే ఇలాగ...
లక్నోలోని ఫ్యామిలీ కోర్ట్ న్యాయవాదులు, కక్షిదారులతో చాలా కోలాహలంగా ఉంది.కోర్ట్ బయట ఒక మూలన, అబ్బాయి తన తల్లిదండ్రులతో, అమ్మాయి తన తల్లిదండ్రులతో కలిసి తమ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. కొద్ది సేపటికి కోర్ట్ బంట్రోతు ఇద్దరి పేర్లూ పిలిచాడు. అబ్బాయి అమ్మాయి లోపలికి వెళ్లారు.
న్యాయమూర్తి మొదట ఫైల్‌ను తిప్పి తిప్పి చూస్తూ ఆపై అమ్మాయిని “నువ్వు వారితో ఎందుకు ఉండాలని అనుకోవట్లేదు?”అని అడిగాడు.
ఆ అమ్మాయి “సార్, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. నేను ఆఫీసుకి వెళ్తాను. అక్కడ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను అన్ని పనులు చేయాలి. నేను పనిమనిషిని పెడతానంటే, మా మామగారు, పనిమనిషి తయారుచేసిన వంట తిననని అంటారు. అయితే నేను మా వల్ల నా భర్త అతని తల్లిదండ్రులను విడిచిపెట్టి ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఈ పరిస్థితుల్లో మాకు విడివిడిగా ఉండడం తప్ప వేరే గత్యంతరం కనిపించడం లేదు" అని చెప్పింది.
జడ్జి ఆమె భర్త తల్లిదండ్రులను పిలిచి, కొద్ది రోజులు కొడుకు, కోడలిని విడివిడిగా బతకనివ్వమని వారికి వివరించాడు. ఈ మధ్యలో మీకు అవసరమైన పనులు చేసి పెట్టడానికి ఒక మనిషిని నియ మించుకోండి. మీ కోడలు మరొక నగరానికి బదిలీ అయిందనుకోండి. రోజులు గడిస్తే అంతా సవ్యంగా మారుతుందని చెప్పాడు జడ్జి. జడ్జి మాటలు విన్న తల్లిదండ్రులు దానికి అంగీకరించారు. క్రమంగా అంతా సర్దుకుంది. ఇలా ఒక కుటుంబం విడిపోకుండా కాపాడబడింది.
ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. ఫ్యామిలీ కోర్ట్ లాయర్ మోనికా సింగ్ మాట్లాడుతూ “అమ్మాయి తన అత్తమామలతో కలిసి జీవించడానికి ఇష్టపడని విడాకుల కేసులే చెప్పింది. అత్యధిక సంఖ్యలో ఉన్నాయి” అని చెప్పింది.
ప్రైవసీ ముఖ్యం
అబ్బాయిలు, అమ్మాయిల వివాహానికి చట్టబద్ధమైన వయసు 21, 18 సంవత్సరాలు అయినప్పటికీ, వివాహానికి సగటు వయసు 25-30 సంవత్సరాలుగా మారింది. ఎక్కువగా అబ్బాయిలు, అమ్మాయిలు ఉద్యోగం లేదా వ్యాపారంలో సెటిల్ అయిన తర్వాతే వివాహం చేసుకుంటారు.
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.