వ్య క్తికి తల మీద సగటున లక్షన్నర వరకు కేశాలు ఉంటాయి.'అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ' ప్రకారం రోజుకి 50 నుంచి 100 వెంట్రుకలు రాలిపోవటం సాధారణమే. ఇంతకంటే ఎక్కువ రాలినా లేదా గుత్తులుగా ఊడినా హెయిర్ ఫాల్ సమస్య ఉందని భావించాలి. సమయానికి ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే బట్టతలగా మారే ఈ ప్రమాదముంది.
సాధారణంగా మహిళల్లో బట్టతల తక్కువగా కనిపిస్తుంది. కానీ ఎక్కువ కాలం వరకు జుట్టు రాలుతున్నట్లయితే అందం తగ్గిపోతుంది. అందుకే ఈ లక్షణాలు కనపడగానే జాగ్రత్త వహించాలి.అధికంగా రాలుతున్నప్పుడు కారణాలను తెలుసుకోవాలి. నిజానికి ఈ సమస్య హెయిర్ కేర్ రొటీన్ సరిగ్గా లేకపోవటం, రాంగ్ డైట్, స్కాల్ప్ సంబంధమైన రోగాల వల్ల ఉత్పన్న మవుతుంది.మనసులో ఎలాంటి ఒత్తిడి ఉన్నా జుట్టు రాలుతుంది.
జుట్టు రాలే ప్రక్రియ
తల మీద వెంట్రుకలు నిదానంగా తగ్గటం : అతి సాధారణంగా కనపడే లక్షణం ఇదే. వయసు పెరుగుతున్న కొద్ది ఇది అధికమవుతుంది.పురుషుల్లో సాధారణంగా నుదుటిపై నుంచి వెంట్రుకలు రాలటం మొదలవుతుంది. కానీ మహిళల్లో తల నలువైపులా కేశాలు తగ్గుతుంటాయి.
గుండ్రటి మచ్చ మధ్య రాలటం: కొందరిలో మచ్చ లాంటి ప్రదేశం నుంచి కేశాలు రాలి పోతాయి. అంటే తల మీద ఒక ప్రాంతంలో నాణెం పరిమాణంలో మచ్చగా ఏర్పడి, అక్కడ వెంట్రుకలన్నీ తొలగిపోతుంటాయి.
టచ్ చేస్తే గుత్తులుగా ఊడటం: కొంత మందికి జుట్టుని పట్టుకోగానే కొన్ని వెంట్రుకలు గుత్తులుగా ఊడిపోతాయి. వీరికి బట్టతల వేగంగా వస్తుంది. కాకపోతే కొందరిలో త్వరగా ఇది నయం కూడా అవుతుంది. సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా సీరియస్, లాంగ్ టైమ్ శారీరక సమస్యల్ని కలిగి ఉన్నప్పుడు ఇది కనిపిస్తుంది.
శరీరంలో అంతటా రాలిపోవటం :
కొందరిలో శరీరంలో అన్ని భాగాల నుంచి వెంట్రు ' కలు రాలుతుంటాయి. ఇది ఒక్కోసారి హఠాత్తుగా కనిపిస్తుంది. కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ వల్ల కూడా ఇలా వెంట్రుకలు రాలిపోతాయి.సాధారణంగా ఇవి కొంతకాలానికి మళ్లీ మొలు స్తాయి. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉత్పన్న మైతే దాని వెనుక కారణం తప్పక ఉంటుంది. ఇలాగే కేశాలు రాలటానికి వెనుక ఉన్న అసలు కారణాన్ని పసిగట్టాలి. అవేమిటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
This story is from the September 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 2024 edition of Grihshobha - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.