![బెస్ ట సీరమ్ ఎంచుకోవడమెలా? బెస్ ట సీరమ్ ఎంచుకోవడమెలా?](https://cdn.magzter.com/1338806029/1729349354/articles/HlrrKMhOi1729880260543/1729880594506.jpg)
మార్కెట్లో ఎన్నో సీరమ్లు అందుబాటులో ఉన్నా, ఏది మీ మీ చర్మాన్ని మెరుగు పరుస్తుంది అన్నది బ్యూటీ ఎక్స్పర్ట్లతోనే తెలుసుకోవాలి.
శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు ముఖంలో మార్పులకు కారణమవుతాయి. దీని ప్రభావం ముఖంపై మచ్చలు, మొటిమలు రూపంలో కనిపిస్తుంది. ఇలాంటి స్థితిలో మీరు చర్మ సమస్యల నుంచి బయటపడడానికి ఎన్నో రకాల స్కిన్ ప్రోడక్ట్స్ ఉపయోగించి ఉండవచ్చు. కానీ వీటితో మీరు కోరుకున్న కాంతివంతమైన చర్మాన్ని పొందలేకపోయి ఉండవచ్చు. సౌందర్య ఉత్పత్తుల కోసం డబ్బు నీళ్లలాగా ఖర్చు పెట్టి ఉండవచ్చు. అయితే దీనికి కారణం మీరు సరైన ఫేస్ సీరమ్ ను ఉపయోగించకపోవడమే. వయసు పెరుగుతున్న కొద్దీ ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత ఇది చాలా అవసరం ఉంటుంది.
ఇలాంటి పరిస్థితిలో స్కిన్ కేర్ రొటీస్లో ఏ రకమైన పదార్థాలతో కూడిన సీరమ్ ఉండాలన్నది బ్యూటీ ఎక్స్పర్ట్ నమ్రతతో తెలుసుకుందాం.
విటమిన్ సి పసుపు గుణం కలిగిన సీరమ్
విటమిన్ సి చర్మాన్ని హానికారక మూలకాల నుంచి రక్షించే యాంటీ ఆక్సిడెంట్గా పని చేస్తుంది. మనం ఆహారం, సౌందర్య ఉత్పత్తులతో తగినంత మొత్తంలో విటమిన్ సి తీసుకుంటే ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన చర్మంలో కొల్లెజన్ ను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని సూర్యరశ్మి నుంచి రక్షించడమే కాకుండా స్కిన్ డ్రైనెస్ ను దూరం చేసి మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది స్కిన్ టోను మెరుగుపరిచి కొత్త కణజాలాన్ని పెంపొందించి స్కిన్ ఏజింగ్, ఫైన్ లైన్స్ ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మెరుపు కాంతిని తీసుకువస్తాయి.
ఒక రకంగా చెప్పాలంటే ఇది స్కిన్ లైటింగ్ ఏజెంట్గా పని చేస్తుంది. ఇందులో ఉన్న కర్కుమిన్ చర్మంలో అదనపు మెలనిన్ను నిరోధించడమే కాకుండా స్కిన్ టోన్ను మెరుగు పరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఫేస్ సీరమ్ విషయానికి వస్తే మీరు రేడియంట్ స్కిన్ కోసం విటమిన్ సి ఫేస్ సీరమ్ను ఎంచుకోవచ్చు. ఇది విటమిన్ సి, పసుపు లాంటి సహజ పదార్థాలతో తయారైనది.చర్మ వ్యాధి నిపుణులు పరీక్షించినది కూడ.ఇందులో హానికారక సల్ఫేట్లు, పారాబేన్స్, ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఉండవు.30 గ్రాముల ప్యాక్ ధర సుమారు 500 రూపాయలు ఉంటుంది.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
![మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/EsRJ1kzgV1736993231828/1736993289807.jpg)
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
![స్పై యాక్షన్ థ్రిల్లర్ స్పై యాక్షన్ థ్రిల్లర్](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/sBTXX4tXc1736993338372/1736993496215.jpg)
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
![కొత్త కథతో నాగార్జున కొత్త కథతో నాగార్జున](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/7DMjhdmmo1736993607476/1736993654575.jpg)
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
![16 అణాల అచ్చ తెలుగమ్మాయి 16 అణాల అచ్చ తెలుగమ్మాయి](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/qFJq0NBsU1736993655652/1736993716842.jpg)
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
![ఇండియన్ మెగాస్టార్ ఇండియన్ మెగాస్టార్](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/BzeOU5RGA1736993497028/1736993598121.jpg)
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
![తిరిగి యాక్షన్ లోకి వరుణ్ తిరిగి యాక్షన్ లోకి వరుణ్](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/4eINkUP6K1736993187092/1736993230836.jpg)
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
![డ్యాన్సింగ్ క్వీన్ డ్యాన్సింగ్ క్వీన్](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/a3ig9at8p1736993406924/1736993496655.jpg)
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
![నేషనల్ క్రష్ నేషనల్ క్రష్](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/h40HCxqte1736993294060/1736993337538.jpg)
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
![దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/GwLGMjnHU1736993100644/1736993180278.jpg)
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
![మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి](https://reseuro.magzter.com/100x125/articles/866/1959277/5CNTg-C9K1736992742196/1736993037525.jpg)
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.