Jai Telangana - కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం
Jai Telangana - కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Jai Telangana ile 9,000 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99 $49.99
$4/ay
Sadece abone ol Jai Telangana
Bu konuda
జీఎస్టీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, సాగువిస్తీర్ణం, వ్యవసాయం, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాలు ఇలా అన్నింటా రికార్డే అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శలు గుప్పిస్తున్న వారికి ఇది చెంపపెట్టే. ఆయన పాలనలో ప్రతి రంగమూ పరిఢవిల్లిందని, దేశానికి తెలంగాణ దశ, దిశ అయిందని సాక్షాత్తు భారతీయ రిజర్వు బ్యాంకే సాక్ష్యాధారాలతో సహా వెల్లడించింది. జీఎస్టీపీ, తలసరి ఆదాయం, విద్యుత్తు, వ్యవసాయం.. ఇలా ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధిలో పరుగులు పెట్టించారని ఆర్బీఐ విడుదల చేసిన 'హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ -2024' నివేదికలోని గణాంకాలు కండ్లకు కట్టినట్టు చెప్తున్నాయి.
సంపదను సృష్టించడమే కాదు దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశదిశను చూపడమే కాదు.. అభివృద్ధికి ప్రణాళికలను రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ఆషామాషీ విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం తొమ్మిదిన్నరేండ్లలోనే దానిని సుసాధ్యం చేసి చూపించారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపగలిగారు. దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టించారు.
Jai Telangana Magazine Description:
Yayıncı: Jai Telangana
kategori: News
Dil: Telugu
Sıklık: One Time

ఆర్థిక వ్యవస్థకు, దేశాభివృద్ధికి కీలకంగా పరిగణించే జీఎస్టీపీ, తలసరి ఆదాయం, స్థాపిత విద్యుత్తు సామర్థ్యం, తలసరి విద్యుత్తు వినియోగం, వ్యవసాయానికి సాగునీరు, పంటల సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు, అటవీ విస్తీర్ణం, మూలధన వ్యయం.. ఇలా పలు కీలక అంశాల్లో తెలంగాణ ఎంతో పురోగతి సాధించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పదుల కొద్దీ అవార్డులు, రివార్డులు ప్రశంసలు నిదర్శనం కాగా.. జాతీయ సూచీలు, జాతీయ సంస్థల విశ్లేషణల్లో తెలంగాణను అగ్రగామిగా కీర్తించడం కేసీఆర్ పాలనకు గీటురాయి. తాజాగా రిజర్వ్ బ్యాంకు మరోసారి తెలంగాణ విజయగాధను దేశానికి చాటి చెప్పింది. పలు సూచీల ఆధారంగా రాష్ట్రాల్లోని ఆర్థిక, విద్య, వైద్య, సామాజిక పరిస్థితులను విశ్లేషిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా 'హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్-2024'ను విడుదల చేసింది.
ఇందులో పదేండ్లలోనే తెలంగాణ సాధించిన ప్రగతిని కండ్లకు కట్టింది. రెండుసార్లు ప్రజలు అధికారం ఇచ్చినా అభివృద్ధి చేయలేదని మాట్లాడేవారికి చెంపపెట్టులాంటి సమాధానం ఇచ్చింది. ఏయే రంగాల్లో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో గణాంకాలతో సహా వివరించింది. తెలంగాణ ఏర్పడిన నాటి పరిస్థితులు.. ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుంటే పదేండ్ల పాలన సాధించిన విజయాలు అవగతం అవుతాయి. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి తాగు, సాగునీటికి కరువై, కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక కునారిల్లిన తెలంగాణ.. కేసీఆర్ పాలనలో ఎంత సుభిక్షంగా ఎదిగిందో, ప్రజల జీవన ప్రమాణాలు ఎలా మారిపోయాయో తెలుస్తుంది.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital