సెలవుల తర్వాత పిల్లలు పాఠశాలకు తిరిగి రావడం మొదలుపెట్టారు. కానీ పుస్తకాలను కలవడానికి ఎవరూ లైబ్రరీకి రాలేదు.
లైబ్రరీలోని పిల్లల పుస్తకాలు, మ్యాగజైన్లు పిల్లల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి.
కిటికీలోంచి వాళ్లు నడుచుకుంటూ వెళ్లడాన్ని చూస్తున్నాయి.
టేబుల్ మీద పడి ఉన్న ఒక పుస్తకం “ఇంతకాలం తర్వాత పిల్లలను చూడటం ఆనందంగా ఉంది. ఈ చిన్నారి పాఠకులు మనలను చేతుల్లోకి తీసుకుని మళ్లీ సంతోషంగా చదివినప్పుడు ఎంత సరదాగా ఉంటుంది. మనం వారికి కథలు, కవితలు, చిక్కుముడులు చెబుతాం” అంది.
తాజా వార్తలు తీసుకువచ్చే వార్తాపత్రిక విచారంగా మారిపోయాడు. అతనికి వాస్తవం తెలుసు.
వినయ పూర్వక గొంతుతో అతడు “కరోనా వైరస్ మహమ్మారి సమయంలో పాఠశాలలు, లైబ్రరీలను చాలాకాలం పాటు మూసివేసారు.
అందువల్ల పాఠకులు పుస్తకాలపై ఆసక్తిని కోల్పోవడం మొదలు పెట్టారు. వారి ఆన్లైన్ స్టడీస్ కారణంగా కొంతమంది పిల్లలు ఇప్పుడు తమ మొబైల్ ఫోన్లలో గేములు ఆడుతున్నారు.
ఇంటర్నెట్లో విషయాల కోసం వెతుకుతున్నారు” అన్నాడు.
పుస్తకాలు, మ్యాగజైన్లు ఇది విని ఆశ్చర్యపోయాయి. “వారు ఇంకా అలా చేస్తున్నారా?” అని అడిగాయి.
“మొబైల్ అధిక వాడకంలోని ప్రతికూలతల గురించి వారు ఇప్పుడు తెలుసుకున్నందున, పరిస్థితి మారుతోంది" అని చెప్పాడు వార్తాపత్రిక.
ఒక మ్యాగజైన్ వార్తాపత్రికకు కృతజ్ఞతలు
తెలుపుతూ "మై డియర్ వార్తాపత్రిక, మా ప్రచురణ, లైబ్రరీ కొంత కాలం మూసివేయబడ్డప్పుడు నీ పేజీలలో ఒక దానిలో బాల సాహిత్యాన్ని ప్రచురించారు. అలా నువ్వు పిల్లల పఠన అలవాటును కొనసాగించావు. అందుకు కృతజ్ఞతలు” అంది.
ఒక పిల్లల మ్యాగజైన్ ఆందోళన వ్యక్తం చేస్తూ “అది సరే, కానీ మనపై పిల్లల ప్రవర్తన మారిపోయింది. ఇంతకు ముందు నేను వారికి వినోదంతోపాటు విజ్ఞానాన్ని రకరకాల బాల సాహిత్యం, యాక్టివిటీలతో అందించాను.
కానీ చూడు, కొంతమంది పిల్లలు ఇప్పటికీ తమ కంప్యూటర్లు, మొబైల్కు అతుక్కుపోయి ఉన్నారు. మనవైపే చూడరు” అంది.
మరొక మ్యాగజైన్ కూడా నిస్పృహతో “నాకూ బాధగానే ఉంది. పిల్లలు మనతో ఎక్కువ సమయం గడిపిన రోజులు నాకు గుర్తున్నాయి. వాళ్లు కథలు, వివిధ రకాల జనరల్ నాలెడ్జ్లలో నిమగ్నమయ్యే వారు.
కానీ ఇప్పుడు వారు మారిపోయారు” అని చెప్పింది.
Bu hikaye Champak - Telugu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin September 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో