స్కూలుకి సెలవు రోజు. జంపీ కోతి, మీకూ ఎలుకలాగే ఇతర అడవి పిల్లలకు కావలసినంత ఖాళీ సమయం ఉండేది. సిటీ అంతా తిరుగుతూ వాళ్లు నానా హంగామా చేసేవారు.
అలాంటి ఒక రోజున బ్యాడీ నక్క తోలు బొమ్మలతో 'పప్పెట్ షో' ప్రదర్శించబోతున్నాడని వార్తలు వచ్చాయి.
ఆ వార్త విని సంతోషంతో ఎగిరి గంతేస్తూ “హుర్రే, ఇది సరదాగా ఉంటుంది. నాకు తోలుబొమ్మల ప్రదర్శనలు ఇష్టం" అన్నాడు జంపీ.
“నువ్వు చెప్పింది నిజమే. ఇంతకాలం బోర్గా గడిపాం. తోలుబొమ్మలాట సరదాగా ఉంటుంది” అన్నాడు మీకూ. బ్యాడీ తోలుబొమ్మలాట పూర్తిగా సరదాగా ఉంటుంది.
రాజు, రాణి, మంత్రి, సేనాధిపతి, గార్డు, డ్యాన్సర్, సింగర్... ఇలా తోలు బొమ్మలు వేదిక పై కదలాడుతూ ప్రేక్షకులను సంతోషంతో చప్పట్లు కొట్టిస్తాయి. ఈ ప్రదర్శనలో ఆకర్షించే ప్రత్యేక విషయం. దీనికి టిక్కెట్ లేదు. దీంతో ప్రదర్శన ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది.
వెనుక కూర్చున్న ప్రేక్షకులకు శబ్దం కారణంగా ఏదీ స్పష్టంగా వినిపించదు. కాబట్టి జంపీ, మీకూలు ముందు వరుసలో కూర్చున్నారు. ప్రదర్శనలోని కథ సమయమే తెలియనంత ఆసక్తికరంగా ఉంది.
“ఓహ్, నా పర్సు ఎక్కడికి పోయింది? కొద్దిసేపటి క్రితం అది నా జేబులోనే ఉంది" జేబులో పర్సు లేకపోవడంతో షాక్ తిన్నాడు బ్లాకీ ఎలుగుబంటి. “ఓహ్, నా నెక్లెస్ ఎక్కడికి పోయింది?” మెడలోని నెక్లెస్ మాయం కావడంతో షాకికి గురైంది వివీ నక్క.
ఇన్స్పెక్టర్ జంబో ఏనుగు వచ్చి విచారణ మొదలుపెట్టాడు. కానీ దొంగకు సంబంధించిన సాక్ష్యం అక్కడ ఏమీ దొరకలేదు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఇది అందరిని ఆందోళనకు గురి చేసింది. వారు బ్యాడీని అనుమానించడం మొదలు పెట్టారు. అతడు వచ్చినప్పటి నుంచే దొంగతనాలు పెరిగాయని భావించారు.
ఇన్స్పెక్టర్ బ్యాడీని ప్రశ్నించినప్పుడు “సార్, మేము పేదవాళ్లం. కానీ దొంగలం కాదు. మీరు మమ్మల్ని సోదా చేయవచ్చు. పిల్లలకు వినోదం అందించడానికి వచ్చాం. మమ్మల్ని దొంగలుగా భావించకండి" అని చెప్పి తోలుబొమ్మలన్నింటిని అతని ముందు పెట్టాడు.
Bu hikaye Champak - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin December 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా