సాలీ ఉడుత మదర్స్ డేని ఎంతో ప్రత్యేకంగా చేయాలనుకుంది. తోట నుంచి సేకరించిన పూలతో ఒక అందమైన కార్డు తయారుచేసింది. దాన్ని తన దగ్గర ఉన్న ఒక లావుపాటి డిక్షనరీ కింద పెట్టి ఆరబెట్టింది. తర్వాత దానిపై హృదయం బొమ్మ వేసి క్రేయాన్స్తో రంగులు నింపింది. కానీ ఆమె మరింత ప్రత్యేకంగా ఏదైనా చేయాలనుకుంది.
వాళ్లమ్మ లూసీ ఆంటీకి షాపింగ్లో సహాయం చేయడానికి ఆమెతో బయటికి వెళ్లింది. వారు బిగ్ మాల్కి వెళ్లారు కాబట్టి తిరిగి రావడానికి చాలా సమయం పడుతుంది.
సాలీ అమ్మ కోసం ఒక కేక్ తయారుచేయాలనుకుంది!
తప్పకుండా ఇది పెద్ద సర్ప్రైజ్ అవుతుంది!
కానీ సాలీకి కేక్ తయారుచేయడం తెలియదు.
తాతయ్యను అడగాలనుకుంది. కానీ ఆయన తన స్నేహితులతో టీవీలో గేమ్స్ చూడటంలో నిమగ్నమై ఉన్నాడు. అది మదర్స్ డే కావడంతో ఆమె వాళ్ల నానమ్మను అడగలేకపోయింది. ఆమెకూ సర్ప్రైజ్ కలిగించాలి అనుకుంది.
ఆమె కజిన్ బిట్టూ ఉన్నాడు. మరి అతడు తనకు సహాయం చేయగలడా?
‘అడిగితే వచ్చే నష్టం ఏమీ లేదు' అనుకుంది.
సాలీ వృత్తాకార మెట్లు ఎక్కి పైన ఉన్న గదికి వెళ్లింది. చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ బిట్టూ ఉడుత కనిపించాడు. అతడు తన మెత్తని తోకను నిలిబెట్టి నృత్యం చేయగలడు. అటు ఇటు పైకి, కిందికి తనకు నచ్చినట్లు ఆడగలడు. జర్క్లు ఇవ్వగలడు.
కేక్ తయారుచేయాలన్న ఆలోచన చెప్పగానే బిట్టు తప్పకుండా సహాయం చేస్తానన్నాడు. అతడు స్కూల్ కేక్ తయారుచేయడం నేర్చుకుని ఉన్నాడు. ఇద్దరూ కిచెన్లోకి వెళ్లి షెలను వెతికారు. బిట్టూకి కొన్ని బేకింగ్ ఆహార పదార్థాలు, చక్కెర, పాలు, ఐసింగ్ ట్యూబ్లు కనిపించాయి. బేకింగ్ షీట్లు తీస్తూ “అయితే మనం రౌండ్ లేదా రెక్టాంగిల్ కేక్ తయారు చేయబోతున్నాం” అన్నాడు.
Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin May 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్