ఆ రోజు ఆదివారం. అందమైన ఉదయం.
ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే అంజలి తన ఆంటీతో కలిసి ఆకాశంలో అందమైన మేఘాలను చూస్తోంది.
“ఆంటీ, ఆ మేఘాన్ని చూడు. ఒక కుక్కలాగా కనిపించడం లేదా?” అంది.
నిజానికి అంజలికి పెంపుడు జంతువు కావాలి.
అందుకే ఆమె ఆంటీని అలా అడిగింది.
“దాని గురించి నన్ను ఆలోచించనీ” జవాబిచ్చింది ఆంటీ. ఆమె జవాబుతో అంజలి సంతృప్తి చెందలేదు. తల్లి దగ్గరికి వెళ్లి అదే ప్రశ్న అడిగింది.
“మమ్మీ నేనొక పెంపుడు జంతువును ఉంచుకోవచ్చా?”.
“పెంపుడు జంతువా?” ఆశ్చర్యపోయింది వాళ్లమ్మ.
“నీకు పెంపుడు జంతువు ఎందుకు కావాలి?” అడిగింది.
"తెలియదు, నాకు ఒకటి కావాలి అంతే” అంజలి బదులిచ్చింది.
“దీని గురించి ఆలోచిస్తాను" అని తల్లి చెప్పింది.
కొంచెం విచారపడినా, కొంతవరకు ఆమెకిది నమ్మకం కలిగించింది. వారం రోజులు గడిచాయి.
అంజలి మళ్లీ “మమ్మీ, నాకు నిజంగానే పెంపుడు జంతువు కావాలి" అంది.
“ఒకవేళ నేను సరేనంటే నీకు ఎలాంటి పెంపుడు జంతువు కావాలో చెప్పు" అడిగింది తల్లి.
“నిజంగానా, చాలా ధన్యవాదాలు” ఎగిరి గంతేసి అంజలి లివింగ్ రూమ్ చుట్టూ పరుగెత్తసాగింది.
“ఆగు, నేనింకా అవును అని చెప్పలేదు" గుర్తు చేసింది తల్లి.
“మమ్మీ గురించి నాకు తెలుసు" అంజలి ఆగి ఊపిరి తీసుకుంది.
“మమ్మీ, బహుశా నాకు ఒక కోతి కావాలేమో” అంది అంజలి.
“ఏంటీ నీకు ఒక కోతి కావాలా? కోతులు చెట్లు ఎక్కడానికి, గుంపులుగా నివసించడానికి స్థలం కావాలి" అని చెప్పింది ఆంటీ.
“ఇదంతా నేను మర్చిపోయాను. నేను కోతిని ఉంచుకోలేను. అది మనతో ఎప్పుడూ సంతోషంగా ఉండదు. అవును కదా ఆంటీ".
“అవును” సమాధానమిచ్చింది ఆంటీ.
“నాకు ఒక పక్షి కావాలి. కాదు కాదు చేప కావాలి.
నేను కుందేలును తెచ్చుకోనా? వద్దు. ఒక గుర్రమైతే అద్భుతంగా ఉంటుంది. ఒకవేళ తాబేలు అయితే? ముద్దోచ్చే చిన్న తాబేలు పర్ఫెక్ట్ ఉంటుంది!".
ఆలోచిస్తున్న అంజలికి ఊపిరి ఆడలేదు.
తాను కోరుకున్న పక్షులు, ఇతర జంతువుల గురించి వెంటనే చదివి తెలుసుకోవాలని ఉత్సాహ పడింది.
Bu hikaye Champak - Telugu dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో