“ హేయ్, మ్యాడీ పప్పెట్ షో చూడడానికి నాతో వస్తావా?” చెట్టు మీద కూర్చున్న కోకో కాకి మ్యాడీ కోతిని అడిగాడు. వెంటనే ఒప్పుకున్నాడు మ్యాడీ.
“పప్పెట్ షో అడవి చివర ఖాళీగా ఉన్న ఒక పొలంలో ఉంది. మనం అక్కడికి ఎలా చేరుకుంటాం?” అడిగాడు మ్యాడీ.
“నాకు రెక్కలు ఉన్నాయి. నీకు లేవు కాబట్టి చెట్టు దిగి నాతో పరుగెత్తుకుంటూ రా” బదులిచ్చాడు కోకో.
చెట్టు నుంచి దిగే ముందు ఏమైనా ప్రమాదం ఉందోనని చుట్టూరా చూసి ఎవ్వరూ కనిపించకపోవడంతో కిందకి దిగి పరుగెత్తసాగాడు.పొదల వెనుక నుంచి సిండీ చిరుత పులి తనను గమనిస్తున్నాడన్నది అతనికి తెలియదు. మ్యాడీ కొంచెం దూరం వెళ్లగానే సిండీ అతన్ని పట్టుకున్నాడు.
“పప్పెట్ షోకి ఆలస్యం అవుతుంది. ప్లీజ్ నన్ను వెళ్లనీ” వేడుకున్నాడు మ్యాడీ.
కానీ సిండీ అతన్ని వెళ్లనివ్వలేదు.కోకో అది చూసి ‘ సిండీ మ్యాడీని పట్టుకున్నాడు. నేను అతన్ని రక్షించడానికి ఏదో ఒకటి చేయాలి' అనుకున్నాడు.
“కావ్, కావ్” అంటూ కోకో తన స్నేహితులందరినీ పిలిచాడు. అందరూ కలిసి సిండీపై దాడి చేసారు.
సిండీ మ్యాడీని వదిలిపెట్టాడు. సిండీ నుంచి విముక్తి పొందాక మ్యాడీ పరుగెత్తుకుంటూ పప్పెట్ షోకి వెళ్లాడు.
స్నేహితుడు కోకోతో కలిసి పప్పెట్ షో చూసాడు.షోని చూడడానికి చాలా జంతువులు వచ్చాయి.
తిరిగి వచ్చేటప్పుడు మ్యాడీకి మళ్లీ అదే సమస్య ఎదురైంది. ప్రమాదాన్ని గ్రహించి ఎలాగోలా పరుగెత్తి ఒక చెట్టు ఎక్కి ఊపిరి పీల్చుకున్నాడు.
ఈ సంఘటన కోకోను ఆలోచింపచేసింది.చాలావరకు సంఘటనలు అడవి బయట జరుగుతున్నాయి. వీటితో చిన్న జంతువులు ప్రమాదంలో పడ్డాయి. భయంతో అవి అక్కడికి వెళ్లడానికే జంకుతున్నాయి. అయితే కోకో ఎన్నోసార్లు కోతులు ఒక చెట్టు కొమ్మ వదిలి మరో కొమ్మను వేలాడుతూ పట్టుకోవడం గమనించాడు. అతని మెదడులో ఒక ఆలోచన మెరిసింది.
Bu hikaye Champak - Telugu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Champak - Telugu dergisinin August 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్