బిర్యానీ డిష్
Champak - Telugu|November 2023
బిర్యానీ డిష్
కథ • వందనా గుప్తా
బిర్యానీ డిష్

కోకో కో కాకికి పాటలంటే ఎంతో ఇష్టం. వాటిని వింటూ ఆనందం పొందేవాడు. పెద్ద గొంతుతో అనుకరించే వాడు.

ఒక రోజు గట్టిగా పాడుతున్నాడు. ఆ సమయంలో సమీపంలో ఉన్న ఒక చెట్టుపై నివసిస్తున్న బుల్ బుల్ పిట్ట కుటుంబంలోని పిల్లలు చదువుకుంటున్నారు.

“మమ్మీ, కోకో అంకుల్ గొంతెత్తి గట్టిగా పాడుతుంటే మేము చదువుకోలేము” పిల్లలు తల్లికి ఫిర్యాదు చేసారు.

“అతడు కర్ణ కఠోరంగా కావ్ కావ్ మని అరుస్తున్నాడు. నాకూ తలనొప్పిగా ఉంది. ఇప్పుడే వెళ్లి ఆపమని చెబుతాను” అని వాళ్ల నాన్న కోపంగా కోకో ఇంటికి వెళ్లడానికి లేచాడు.

బుల్బుల్ పిట్టల తల్లి నీనా అతన్ని ఆపింది.

“ఇలా మనం ఇరుగు పొరుగు వారితో గొడవ పెట్టుకోవడం సరికాదు” అని చెప్పింది.

“మరి ఏం చేస్తాం? ఆ భయంకరమైన గొంతును భరిస్తూ ఉంటామా? ఇక్కడ బతకడం కష్టంగా మారింది.”

“నేను అతనితో మాట్లాడుతాను" అంది నీనా. తర్వాత కోకో ఇంటికి వెళ్లింది.

“వావ్! కోకో, మీరు ఎంత మంచిగా పాడుతున్నారు. ఇంత గొప్ప గాయకులు మా పరిసరాల్లో నివసిస్తున్నారని నేను ఈ రోజే తెలుసుకున్నాను” అంది కోకోతో.

"లేదు, మీరు అతిశయోక్తి చేస్తున్నారు” సిగ్గుపడుతూ చెప్పాడు కోకో.

“కాదు, అయినా మీ విలువైన గొంతును ఇలా ఎందుకు వృథా చేసుకోవాలి? అందరూ టిక్కెట్లు కొని పాటను ఆస్వాదించే స్టేజీపై మీరు పాడాలి.”

"దానికి నేను ఎంతో సాధన చేయాల్సి ఉంటుంది” అన్నాడు కోకో.

“కానీ అందరి ముందు మీరు ఇలా ప్రాక్టీసు చేయకండి. టికెట్ కొనుక్కోకుండా ఉచితంగా మీ గొంతు వినేలా చేసుకోకండి" అని చెప్పి నీనా వెళ్లిపోయింది.

కోకో గాన కచేరీ గురించి ఆలోచించసాగాడు.

‘ఫంక్షన్లలో అందరూ పాడుతారు, కానీ నేను భిన్నంగా ఏదైనా చేయాలి. గొప్ప సంగీత విద్వాంసుల గురించి తెలుసుకుని ఇది మొదలు పెట్టాలి' అనుకున్నాడు.

Bu hikaye Champak - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Champak - Telugu dergisinin November 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

CHAMPAK - TELUGU DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 dak  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
Champak - Telugu

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

తాతగారు అంతర్జాతీయ కాఫీ డే

time-read
1 min  |
October 2024
మనకి - వాటికి తేడా
Champak - Telugu

మనకి - వాటికి తేడా

ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.

time-read
1 min  |
October 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.

time-read
1 min  |
October 2024
పర్యావరణ అనుకూల దసరా
Champak - Telugu

పర్యావరణ అనుకూల దసరా

అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.

time-read
1 min  |
October 2024
పర్యావరణ హిత రావణుడు
Champak - Telugu

పర్యావరణ హిత రావణుడు

ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

time-read
2 dak  |
October 2024
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
Champak - Telugu

దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా

నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.

time-read
1 min  |
October 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.

time-read
1 min  |
October 2024
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
Champak - Telugu

మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు

మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.

time-read
1 min  |
October 2024