భారత్ సరిహద్దు దేశం పాకిస్తాన్లో ఆకలి కేకలు ఆదేశం హద్దులు దాటుతున్నాయి. పాక్ ని పౌరులు ఆకలిని తట్టుకోలేక సమీప పొరుగు దేశాలవైపు పరుగులు పెడుతున్నారు. ఈక్రమంలో తాము చేస్తున్నది సక్రమమా..? అక్రమమా అనే విచక్షణను పూర్తిగా మర్చిపోతున్నారు. ఒకానొక దశలో తమ దేశం పరువు పోతున్నా తమకేమీ పట్టదన్నట్లుగా వ్యవహరించారు. పాలకులు తమ గోడు పట్టించుకోని పరిస్థితుల్లో... యావత్ కుటుంబం ఆకలితో చావును కౌగిలించుకోలేక దేవుడు "పేరుతో ఆధ్యాత్మిక యాత్రలు చేసి, అక్కడే ఉండిపోయి భిక్షాటనతో తమ కుటుంబాలను పోషించుకోవడం తప్ప మరే ఇతర మార్గం కనిపించడం లేదని పాక్ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో ఇంతటి ఆకలి కారణాలను నిశితంగా పరిశీలిస్తే... గ్యాస్, పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఇతర ఆహార రంగాలలో ధరల పెరుగుదలతో మధ్య ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పాకిస్తాన్ కనీవినీ రీతిలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఇప్పుడు ఎదుర్కొంటోంది. తాజాగా కొత్త ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యంలో పాక్ లో ఈ ఆకలి కేకలు దేశ సరిహద్దులు దాటవని ఆశిద్దాం...!
సౌదీ అరేబియాకు యాత్రికుల వేషధారణలో వెళ్లేందుకు ప్రయత్నించిన 24 మంది పాకిస్థానీ యాచకులు పాక్ లోని ముల్తాన్ విమానాశ్రయంలో అరెస్టు అయ్యారు. సౌదీకి వెళ్లే విమానాల నుండి మొత్తం 32 మంది వ్యక్తులను పంపడం సర్వసాధారణమయ్యింది. ఇలాంటి సంఘటనలు పదేపదే జరగుతుండటంతో సౌదీ అరేబియా అలర్ట్ అయ్యింది. మారువేషంలో ఉన్న మరో 16 మంది పాకిస్తానీ యాచకులు సౌదీ అరేబియాకు వెళ్లే విమానం నుండి ఆఫ్డ్ చేసి, గల్ఫ్ రాజ్యానికి వెళ్లడానికి ప్రయత్నించినందుకు అరెస్టు చేశారు. కొద్ది నెలల క్రితం పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్‌లో సౌదీకి వెళ్లే విమానం నుండి యాచకులను దించివేసింది. వీరిలో ఒక చిన్నారి, 11 మంది మహిళలతో పాటు నలుగురు పురుషులతో సహా 16 మంది వ్యక్తులతో కూడిన బృందం ఉమ్రా వీసాపై ప్రయాణిస్తున్నది. ఉమ్రా అనేది మక్కాకు ఇస్లామిక్ తీర్థయాత్ర, ఇది సంవత్సరంలో ఏ సమయంలోనైనా చేయవచ్చు.ఉమ్రా వీసాల గడువు ముగియడంతో వారు పాకిస్థాన్‌కు తిరిగి వెళ్లాల్సి ఉంది. కానీ పలు సందర్భాలలో చాలా మంది సౌదీ అరేబియాలోనే భిక్షాటన చేస్తూ ఉండిపోతుండటంతో అధికారులు ఆరా తీస్తున్నారు.
Bu hikaye Suryaa Sunday dergisinin February 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin February 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing