ఏట్లో నీళ్ళు లేక, ఎండలకు భూమిలోని నీరు ఆవిర్లు గా పైకి ఎగబడుతూ కనపడుతోంది. ఊర్లోని గుడ్డలు అన్నింటి మురికీ వదలగొట్టి, నిత్యా భిషేకం లో మునిగిపోయే తూరుగా ఉన్న చాకలి రేవు బండ ఇప్పుడు గొంతు ఎండిపోయి చివరి క్షణాల్లో తులసి నీళ్ళ కోసం ఎదురు చూస్తోంది.
ఊర్లో ఉన్న అందరి బట్టల మురికిని వదలగొట్టే సుబ్బడికి వచ్చిన అతి పెద్ద కష్టం ఏట్లో నీళ్ళ కొరత గొట్టాలను భూమిని చీల్చి లోపలకు పంపితే దుమ్ము పైకి లేస్తోందే కానీ చుక్క నీటి జాడ బయట పడలేదు.
అందరి ఇండ్లల్లో కాసింత పనిచేసి, సంవత్సరం అంతా బ్రతికే వీళ్ళ లాంటి వాళ్లకు గడ్డు కాలం వచ్చింది.
ప్రతి ఇంటిలో తక్కువ నీళ్లతో పనిచేసే మిషన్ల శబ్దం బయటకు రాకుండా వచ్చి మూలన కూర్చున్నాయి.
ఎంతకాలం ఊర్లో పనిలేకుండా ఉండటం, వాళ్లను వీళ్ళను అడిగి ఎంతకాలం కడుపు నింపుకోవడం ఆలోచిస్తే కాలం గిర్రున తిరుగుతోంది. ఊరికి పెద్ద ఆసామి అయిన రాయప్ప దగ్గరకు వెళ్ళాడు, సుబ్బన్ని చూడగానే మొత్తం పరిస్థితి అర్థమైంది. తన దగ్గర ఊరికి సరిపడినంత పొలం ఉంది, అందులో వ్యవసాయం చేసుకొని నిమ్మళంగా బ్రతుకు వెళ్లబుచ్చ వచ్చు, కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా ఒక్కటే నీళ్ళ కొరత, తెలిసి తెలిసి మళ్ళీ గట్టున ఉన్న వాణ్ణి ఊబిలోకి దింపడం ఎంత వరకు సమంజసం అని ఆలోచనలో పడ్డాడు రాయప్ప.
అయినా పని కోసం వచ్చిన వాణ్ణి కుంటి సాకులతో వెనక్కు పంపడం ఇష్టం లేక, “సుబ్బడు ఊరికి తూరుగా ఉన్న, అర్ధ ఎకరా చేను తీసుకో , అక్కడ ఏదైనా చేసుకొని బ్రతుకు “అన్నాడు రాయప్ప.
Bu hikaye Suryaa Sunday dergisinin September 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin September 01, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.