తాళపత్రాల ఉనికి భారతదేశంలోనే కాదు ఆసియా మరియు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఉంది. తాళపత్ర గ్రంథాలు నేడు విలువైన కళాఖండాలుగా మాత్రమే కాకుండా భారతదేశ సాహిత్య మరియు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.క్రీ.పూ. 3200లో ఈజిప్షియన్లు మెసొపొటేమియాలో వెదురు లేదా రెల్లుతో కనిపెట్టిన మొదటి పెన్నును “రీడ్ పెన్నులు” అంటారు.వాటిని సిరాలో ముంచి, పాపిరస్ మొక్క యొక్క గుజ్జుతో తయారు చేసిన మందంగా ఉండే కాగితంపై ఉపయోగించారు. 'పెన్' అనే పదం 'పెన్నా' (Penna) అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది.దీనికి అర్థం 'ఈక’. 6వ శతాబ్దంలో స్పెయిన్లోని సెవిల్లెలో కనుగొ న బడిన క్విల్ పెన్ (పక్షి ఈకలతో) వెయ్యి సంవత్సరాలకు పైగా 19వ శతాబ్దం మధ్య వరకు పాశ్చాత్య ప్రపంచంలో ప్రాథమిక రచనా పరికరంగా ఉపయోగించబడింది. బాతులు లేదా హంసల యొక్క ఈకల మొదళ్ళు డోలుగా లేదా ఖాళీగా ఉండడంతో, కేశనాళిక చర్య (Capillary Action) ద్వారా సిరా పాళీ (Nib) లోకి లాగ బడుతుంది. పార్మెంట్ మరియు జంతు చర్మాలపై చిన్న అక్షరాలతో స్పష్టంగా రాసేందుకు రెల్లు పెన్నుల కంటే క్విల్ పెన్నులు అనుకూలంగా ఉండడంతో పాటు త్వరగా పాయింట్ను కోల్పోకపోవడం వాటి ప్రత్యేకత. మొనదేలిన వీటి కొసను సిరా బుడ్డిలో (Ink Pot) ముంచి సిరా ఆరిపోయేలోపల కొన్ని పదాలను రాయవచ్చు. చట్టం వ్యక్తులకంటే ఉన్నతమైనది మరియు అది అందరికీ సమానంగా వర్తిస్తుంది అనే సూత్రం ఆధారంగా మానవ హక్కులలో ఒక గొప్ప మలుపుగా అభివర్ణించదగ్గ “మాగ్నా కార్టా” లేదా “గ్రేట్ చార్టర్” పై 1215లో ఇంగ్లండ్ రాజు జాన్ క్విల్ పెన్నుతోనే సంతకం చేయడం విశేషం. 1800ల ప్రారంభంలో డిప్ లేదా నిబ్ పెన్ లు వాడుకలోకి వచ్చే వరకు పెన్ ప్రపంచంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. ఈ పెన్నులు ప్రత్యేకం గా బర్మింగ్హామ్, ఇంగ్లాండ్, మరియు జర్మనీలో భారీగా ఉత్పత్తి చేయబడేవి. లోహపు పాళీ క్విల్ కంటే మరింత అనుకూలమైన ఎంపికగా మారడంతో క్విల్ పెన్స్ వాడకం కాలక్రమేణా బాగా క్షీణించింది.
Bu hikaye Suryaa Sunday dergisinin November 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa Sunday dergisinin November 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్‌కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number