గత ప్రభుత్వం సివిల్ వర్మ, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు. గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు.
విజయవాడ, సూర్య ప్రధాన ప్రతినిధి : గత ప్రభుత్వం సివిల్ వర్క, పెయింటింగ్ వర్క్స్ కొనుగోళ్ల మీద దౄఎష్టి పెట్టి విద్యాబోధన కావాల్సిన ఉపాధ్యాయులను విస్మరించారని సమాచార శాఖ మంత్రి సారథి ఆరోపించారు.గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయకుండా ఎన్నికల ముందు ఉత్తుత్తి డిఎస్సీ ప్రకటన ఇచ్చి విద్యా రంగానికి తీవ్ర నష్టం చేశారు. చంద్రబాబు, పవన్, బీజేపీ కూటమి ప్రభుత్వం రాగానే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని చెప్పారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి క్యాబినెట్ అమోద ముద్ర వేసినట్టు మంత్రి పార్థసారథి ప్రకటించారు. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు.
డిఎస్సీకి టెట్ తప్పనిసరి అని తెలిసినా, ఆర్నెల్లకు ఓసారి టెట్ నిర్వహించకుండా వేలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులు నష్టపోయేలా గత ప్రభుత్వంలో వ్యవహరించారని మంత్రి సారథి ఆరోపించారు. 80 శాతం డిఎస్సీ మార్కులు, 20శాతం టెట్ మార్కులతో నియామకాలు జరుగుతాయి. టెట్ ఎన్నిసార్లైనా రాయొచ్చని, సకాలంలో నిర్వహించక పోవడం వల్ల అభ్యర్థులు మార్కులు తెచ్చుకునే అవకాశం కోల్పోయారన్నారు. మూడేళ్ల క్రితం టెట్ నిర్వహించడం వల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు.
నాణ్యత కలిగిన విద్యను అందించడం కోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సమగ్రంగా పరిశీలించి విద్యా ప్రమాణాలను పెంచేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టు చెప్పారు.
Bu hikaye Suryaa dergisinin June 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Suryaa dergisinin June 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
రాహుల్ గాంధీని కలిసిన ఏపీసీసీ చీఫ్ షర్మిల
ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఫిబ్రవరిలో తెలంగాణకు రాహుల్
తెలంగాణ బ సూర్యాపేట లేదా ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ రానున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవము బుధవారం ఘనంగా జరిగింది
ఏపీలో బోగస్ పింఛన్లు కట్
ప్రభుత్వం సంచలన నిర్ణయం!
గోశాల ప్రసాద్ మరణం తీరని లోటు
సీనియర్ జర్నలిస్ట్, దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో వెలువడుతున్న ఆరాధన పత్రిక సంపాడుకులు గోశాల ప్రసాద్ మరణం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేవారు.
ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం
తిరుపతి శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో కనుమ పండుగ సందర్భంగా బుధవారం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు
జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మృతిపై సీఎం బాబు దిగ్భ్రాంతి
రాజకీయ విశ్లేషకులు గోశాల ప్రసాద్ మౄఎతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి లోకేష్తో మంచు మనోజ్ భేటీ
• నారావారిపల్లెకు వెళ్లిన మంచు మనోజ్, మౌనిక • లోకేశ్లో 45 నిమిషాల పాటు గడిపిన మనోజ్
తెలుగు రాష్ట్రాల హైకోర్టుల జడ్జిలుగా ఆరుగురి పేర్లు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
స్కిల్ కేసులో సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల రియాక్షన్
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ గత ప్రభుత్వం వేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే.