సతీమణితో చంద్రమోహన్
సుదీర్ఘ తెలుగు చలనచిత్ర పరిశ్రమ చరిత్రలో నటుడు చంద్ర మోహన్ ఆధ్యాయం ముగిసింది. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. దాదాపు యాభై ఏళ్లుగా చిత్ర పరిశ్రమతో మంచి స్నేహానుబంధం సాగించారు. సుమారు 930 చిత్రాల్లో నటించటం అంటే ఆషామాషీ విషయంకాదు..ఇందులో 175 చిత్రాలకు పైనే హీరోగా నటించి తెలుగువాకిళ్లలో మంచి నటుడిగా పేరొందారు. తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కూడా చేశారు. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవం గడించి ఇటీవలనే దివికేగిన చంద్రమోహన్ జీవితంలో సాధించిన విజయాలు, ఆయన ఒకింత ఎదుర్కొన్న ఆటుపోట్లు.. ఎన్నో ఉన్నాయి..-ఇండస్ట్రీలో నటుడిగా రంగ ప్రవేశం చేశాక 'రంగులరాట్నం’ సినిమా 1966లో విడుదలైంది..ఆయన నటనకు మంచి పేరుతెచ్చిపెట్టింది.. అందుకు నంది అవార్డు కూడ అందుకున్నారు. అయితే మళ్లీ 6నెలల దాకా మరో సినిమా లేదు.. ఆ తర్వాత 'మరపురాని కథ', 'బంగారు పిచ్చుక చిత్రాలు వచ్చాయి. ఆపై దాదాపు రెండున్నరేళ్ల దాకా వేషాలే కరువయ్యాయి.. ఒకదశలో ఆయన గురువు బిఎన్‌రెడ్డి ఆయన్ని హీరోగా తప్ప చేయవద్దన్నారు. అందుకే తొలినుంచి చిన్నచిన్న వేషాలు వచ్చిన చంద్రమోహన్ సరేమిరా అన్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఇంటి నుంచి డబ్బులు తెప్పించుకోవటానికి ఒకింత మొహమాటం,. మద్రా వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకున్న రోజులు కూడ ఉన్నాయనే ఆయన అపుడపుడూ చెబుతుండేవారు. మరో దశలో మద్రాసు విడిచి వెళ్లిపోదామని కూడ అనుకున్నారు.. అయితే పట్టుదల పెరిగి అక్కడే ఉండి తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్నారాయన...నన్ను నేను పోషించుకోవాలి..ప్రేక్షకులు నన్ను మర్చిపోకూడదు. ' హీరోగానే నటించాలనే ఆయన పట్టుదలను సడలించుకుని నటుడిగా ఒకింత బిజీ అయ్యారాయన ఆరోజుల్లో...
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin November 26, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం “కార్ట్యూ న్స్"
ఈ వారం “కార్ట్యూ న్స్\"
బకాయిలు వసూలు కావాలంటే?
వాస్తువార్త
ప్రత్యుపకారం నిష్పలం
ప్రత్యుపకారం నిష్పలం
కోటలకు కోట కొండవీటి కోట
ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.
చమత్కార శ్లోకాలు
మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.
సాధన చేస్తే గణితం సులభమే!
కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.
బాలగేయం
విజయం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
మట్టి విగ్రహం
రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.