కాలానుగుణంగా ఈ వైవిధ్యం మార్పుకు లోను అవుతూ అభివృద్ధి చెందుతూనే ఉంది. స్వాతంత్య్రా నంతరం మారిన ఆర్థిక సరళీకృత విధానాల ద్వారా 21వ శతాబ్దంలో ఆ మార్పులు చాలావేగంతో జరిగాయి, జరుగుతు న్నాయి.అయితే మారుతున్న జీవన విధానం, ఆలోచనల సరళిలో చెప్పుకోదగిన పెద్ద మార్పు మన ఆహారపు అలవాట్లే. 1990వ దశకంలో సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ దశలో భారతదేశంలోని అభివృద్ధి చెందుతున్న పైతరగతి వర్గం మొదటి నుండి ఆహార ప్రత్యామ్నాయాల కోసం అన్వేషణలో ఉన్న సమయంలో ఫాస్ట్ఫుడ్స్, జంక్ఫుడ్స్ రూపంలో ఈ ప్రత్యామ్నాయాలను అందించడానికి బహుళజాతి సంస్థలకు అప్పటి ప్రభుత్వాలు తలుపులు తెరిచాయి.
దీనిఫలితంగా అనేక ఫుడ్సెంటర్ రిటైల్ చైన్లు తమ అవుట్లెట్లను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది శీతల పానీయాలు పరిశ్రమలో పెట్టుబడి పెట్టగా, మరికొందరు చాక్లెట్లు, బిస్కెట్లు, నూడుల్స్ మొదలైన వాటిపై శ్రద్ధ పెట్టారు. అదేసమయంలో మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలకు అందిన ప్రయోజనాలతో కొంత ఆర్థిక స్థిరత్వం, ఉపాధి అవకాశాలు, మారిన జీవన విధానంలో వారిలో కొత్తదనం పట్ల కొంత ఆసక్తి, చిన్న కుటుంబాలుగా విడిపోవడం, నూతన అభిరుచులు ఏర్పడడం, చదువులు,ఉద్యోగం, ఉపాధి కొరకు దూరాభారాలు ప్రయాణం చేయడం లాంటి అవసరాలు ఏర్పడడం, సోషల్ మీడియా ప్రభావం వలన కొత్తకొత్త రుచులు, వంటలు తెలుసుకోవడం వాటిని అందుకోవాలనే ప్రయత్నంలో పోటీ పడడంలో భాగంగా ఆహార పరిశ్రమ ఎన్నడూ లేనిరీతిలో కొత్తపుంతలు తొక్కి విస్తృత అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆ క్రమంలో మధ్యతరగతి, దిగువ తరగతుల పుణ్యమా అని స్ట్రీట్ఫుడ్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది.అలాంటి స్ట్రీట్ఫుడ్ గురించి ఈవారం తెలుసుకుందాం ఉదయం పూటో,ఉదయం పూటో, సాయంత్రం సమయాల్లో అలాఅలా వీధుల్లోంచి వెళుతుంటామా ఘుమఘుమలాడే మసాలా ఆ దోశనో, ఇంతెత్తున పొంగిన వేడివేడి పూరీల ప్లేటో, దంచికొట్టే బజ్జీల వాసనో, కమ్మని పకోడీ వాసనో, లేదంటే నోరూరించే జిలేబినో.. రా రమ్మనే సమోసానో, మనసును ఊదరకొట్ట పఫ్ , హుషారు తెప్పించే నూడుల్స్ ఏదో ఒకటి అలా కనిపిస్తే ఇలా బండిని పక్కన పెట్టేసి పటు పట్టాలనిపిస్తుంది.అవును కదూ..
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.