అప్పుడే వేసవి వచ్చేసింది. ఈ వేసవి ఆరంభంలోనే ఎండలు మండుతున్నాయి. భానుడి ప్రతాపం వలన భూగోళం అగ్నిగోళంలా భగభగమండే నిప్పుల కొలిమిలా మారింది. ఆ వేడిమి తట్టుకోలేక ప్రజలు అల్లాడుతున్నారు. వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో ప్రజలు ఇంటి నుండి బయటికి రావడానికి జంకుతున్నారు.
ఎండాకాలం రాకముందే ఎండల తీవ్రత రోజురోజుకు అధికమవుతోంది. ఉదయం, సాయంత్రం వేళలో వాతావరణం చల్లబడినా, గత కొద్ది రోజులుగా మధ్యాహ్నం పూట ముఖం మాడిపోయేలా ఎండ దంచుతోంది. ఏప్రిల్, మే నెలలో ఉండాల్సిన ఎండలు మార్చి నెలలోనే ప్రారంభమయ్యాయి. ఈ వేసవి ప్రారంభంలోనే భానుడు ఇలా సెగలు గక్కుతుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు భానుడు చండ ప్రచండంగా తన ప్రతాపాన్ని చూపడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. భానుడి ప్రతాపానికి పగటిపూటే కాదు. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి.రాత్రిపూట 25 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మార్చి నెలలోనే సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత అధికమవుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలను జారీ చేసింది.దీనినిబట్టి రానున్న కాలంలో గత వంద ఏళ్లలో కూడా ఎప్పుడూ నమోదు కాని అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం కూడా ఉంది.ప్రజలు పగటిపూట ఎక్కడికైనా వెళ్లాలంటే జంకుతున్నారు. రాత్రి వేళల్లో కూడా ఉక్కపోతలు తగ్గడం లేదు. అధిక ఉష్ణోగ్రతలు మనుషులకే కాదు భూమిపై ఉన్న ప్రతి జీవరాశికీ ప్రాణాపాయ పరిస్థితిని కల్పిస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక పక్షులు, జంతువులు విలవిల్లాడిపోతున్నాయి. ఎండవేడిమి తట్టుకోలేక ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. పశ్చిమ,ఉత్తర తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుందని,హైదరాబాద్‌లోనూ ఎండలు అధికంగానే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 24, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin March 24, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు