మానవ జీవితం ఓ అద్భుతవరం జీవనయానంలో అనుకున్నవి, అనుకోనివి జరుగుతూనే ఉంటాయి. నవ్విన క్షణాలు, బాధపడిన ఘడియలు మనంద రికీ నిత్యఅనుభవమే. జీవన గమనానికి ఓ ప్రణాళిక వేసుకుంటాం. పథకం ప్రకారం జరిగితే పరమానందపడతాం, ఊహించని అవాంఛనీయమైన ఘటనలు జరిగినపుడు చింతించడం సాధారణం అయ్యింది. జీవితం ఓ రోడ్డు ప్రయాణం. రోడ్డంటే అద్దంలా ఉండడమే కాదు, మార్గాన స్పీడ్ బ్రేకులు, గుంతలు, భయంకర మలుపులు, ప్రమాదభయాలు ఉంటాయి. మరణం అనివార్యమని తెలిసినా అతిగా దుఃఖించడం హాస్యస్పదం. జననంతోనే మరణం కూడా నిశ్చయించబడిందని మరువరాదు. ఇలాంటి సుఖదుఃఖాలు, కష్టనష్టాల జీవితాన్ని చిరునవ్వుతో ఎదుర్కొని, అనుక్షణం ఆస్వాదించగలగడం ఓ అద్వితీయ కళ. చింతలు చిదిమేసి సంతోషంగా జీవించడానికి అనేక అంశాలు, మార్గాలు దోహదపడతాయి.
> ఆశావహ దృక్పథం సదా ఆరోగ్యదాయకం. దురాలోచనలు, దురుద్దేశాలు అనారోగ్యదాయకం. పక్కా ప్రణాళిక విజయాన్ని దగ్గరకు చేర్చుతుంది. అనవసరం ఆందోళనకూ ఆస్కారం ఇవ్వొద్దు.
> సమస్యలు లేని జీవితం లేదు. సమస్యకు సమాధానం వెదకడం, సఫలత కోసం సర్వశక్తులు దారపోయడం అలవాటు చేసుకోవాలి. ఫలితాన్ని అతిగా ఊహించుకొని మానసిక ఒత్తిడికి గురికాకూడదు. సత్ఫలితం రానపుడు అంగీకరించడం, తదుపరి నవ్వ అడుగులను అన్వేషించడం ఉత్తమం.
> సంపూర్ణ విషయపరిజ్ఞానం లేకుండా కార్యానికి పూనుకోరాదు. కార్యసాధనకు సమాచార సేకరణ, లోతైన విశ్లేషణ, బహుముఖీన కోణంలో ఆలోచనలు చేయాలి. కొద్ది అవగాహనతో ప్రారంభిస్తే అపజయానికే అవకాశాలు ఎక్కువ. కీడెంచి మేలెంచుదాం.
>సమస్య ఏమిటి? సమస్యకు కారణాలేమి? సమస్య పరిష్కారానికి మార్గాలు ఏమిటి? వీటిలో ఉత్తమ మార్గాన్ని ఎన్నుకోవడంలో సఫలమైతే గెలుపు పునాదులు సిద్ధించినట్లే.
> బిజీగా ఉందాం. ప్రతి క్షణం పనిలో నిమగ్నం అవుదాం. అనవసర ఆలోచనలకు సమయం ఇవ్వవద్దు. అనవసర చింతతో నిరాశ ఆవరించి ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
> భౌగోళిక కాలమానంలో మన జీవితకాలం చాలా చిన్నది. నిన్నటి ఓటమి నేటి కార్యదక్షతను రెట్టింపు చేయాలి. ఒకే సమస్యను అనేకసార్లు తలిచి వగచి రోజులు, వారాలు, నెలలు, ఏండ్లు ఏడరాదు.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin May 26, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఫోటో ఫీచర్
పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం
రాజ భోగాల రైలు
భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.
గుప్త దానం
ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.
వారఫలం
వారఫలం
ఈ వారం కార్ట్యు న్స్
ఈ వారం కార్ట్యు న్స్
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.
బాలగేయం
ఊగాడు
సూపర్ చిప్స్
సూపర్ చిప్స్
విజయానికి సోపానాలు
విజయానికి సోపానాలు