అనకాపల్లి పేరు చెబితే ఠక్కున బెల్లం గుర్తుకు వస్తుంది. ఈ బెల్లంకు దేశంలో మంచి గిరాకీ ఉంది. దేశంలో రెండవ అతి పెద్ద మార్కెట్గా దీనికి గుర్తింపు ఉంది. అనకాపల్లి బెల్లం మార్కెట్ విస్తీర్ణం 32 ఎకరాలలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ తర్వాత దేశంలో అనకాపల్లి రెండవ స్థానంలో ఉంది ఈ మార్కెట్. 12 నుంచి 16 కేజీల బరువులో బెల్లం దిమ్మలను. రైతులు తయారు చేస్తారు. భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచే ఎగుమతులు జరుగుతుంటాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, * ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇక్కడ బెల్లం ఎగుమతి అవుతుంది. అనకాపల్లి మార్కెట్ కు వచ్చే బెల్లంలో 80 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ప్రతి ఏటా నవంబరు నుంచి ఏప్రిల్ వరకూ బెల్లం సీజన్ నడుస్తుంది. అయితే బెల్లం మార్కెట్కు వచ్చే బెల్లం దిమ్మల సంఖ్య ఏటా తగ్గుతుండడం ఆందోళనకరం. చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతుండడం, గిట్టుబాటు ధర లేకపోవడం ఒక కారణంగా చెప్పవచ్చు. ఈ మార్కెట్లో ఒకప్పుడు సుమారు 150 కోట్ల వరకూ వ్యాపారం జరిగేది. తర్వాత ఈ హవా తగ్గుకుంటూ వస్తుంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్ వైభవం కనుమరుగు కానుందా? ప్రస్తుత పరిస్థితులు అలానే కనిపిస్తున్నాయి. 2016-17 సీజన్లో అత్యధికంగా 146 కోట్ల వ్యాపారం జరిగింది. 2018 నుంచి 2021 మార్చి సీజన్ వరకూ 91 కోట్ల నుంచి 77 కోట్లకు పడిపోయింది. ఉత్తర కోస్తా జిల్లాలలో ఎక్కడికక్కడ మార్కెట్లు పుట్టుకురావడంతో బెల్లం మార్కెటు తక్కువగా వస్తుంది.
చెరకు సాగు తగ్గుముఖం
అనకాపల్లి జిల్లాలో చెరకు సాగు ప్రధానమైన పంటగా ఉండేది. రైతులు బెల్లం గానుగ ఆట ఆడి బెల్లం దిమ్మలను తయారు చేసి మార్కెటు పంపడం చేసేవారు. మరి కొంతమంది రైతులు జిల్లాలో ఉన్న తుమ్మపాల, గోవాడ, ఏటికొప్పాక, తాండవ చక్కెర కర్మాగారాలకు చెరకు సరఫరా చేసేవారు. అయితే సహకార చక్కెర కర్మాగారాలకు ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లభించని కారణంగా అప్పుల ఊబిలో కర్మాగారాలు కూరుకుపోయి దివాలా దిశగా పయనిస్తున్నాయి.
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin August 25, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఉసిరి రుచులు
ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!
ఖాళీ కాలం
ఖాళీ కాలం
మీఠాపాన్ దోస్తానా!!
ఈ వారం కవిత్వం
ఊరగాయ
సింగిల్ పేజీ కథ
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది
'సంఘీ భావం
సోషల్ మీడియా కట్టడికి ప్రత్యేక చట్టం అవసరం
బేషుగ్గా!
కాదేదీ కవితకనర్హం అని శ్రీ శ్రీ అంటే .. రూపం మారినా కళాత్మకంగానో .. ఆకర్షణీయంగానో ఉంటే.. వాటి ఆదరణకు కొదవే ఉండదని ఆయా కళారూపాల సృష్టికర్తల భావన.
తాజా వార్తలు
ఆడవాళ్లకి నిద్ర తక్కువ
'జాతిరత్నాలు' దర్శకుడితో విశ్వక్ సేన్
జాతిరత్నాలు వంటి హిలేరియస్ ఎంటర్టైనర్తో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందు కున్న అనుదీప్ తన తాజా చిత్రానికి శ్రీకారం చుట్టాడు.
అద్వితీయం.. అపూర్వం
తారాతీరం