ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ వింత విషయాలను తెలుసుకోవడానికి ప్రజలు కూడా నిత్యం ఆసక్తి చూపిస్తూనే ఉంటారు. భారతదేశంలో మొదటి సూర్యోదయ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడి అంజావు జిల్లాలోని డాంగ్వ్యాలీ అనే గ్రామంలో మొదట సూర్యుడు ఉదయిస్తాడు.ఈ పట్టణాన్ని జపాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఈ గ్రామంలో ఉదయం 5 గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు.జూన్ నెలలో అయితే ఉదయం 4.30గంటలకే సూర్యుడు ఉదయిస్తాడు. సాయంత్రం నాలుగున్నరకే అస్తమిస్తాడు. ఈ ప్రదేశం సముద్రమట్టానికి 1,240 మీటర్ల ఎత్తులో ఉండి నదులు, పర్వతాలతో నిండి ఉంటుంది. ఇది చైనా, మయన్మార్ దేశాల మధ్య నెలకొని ఉంది. బ్రహ్మపుత్ర నదికి ఉపనది అయిన రోహిత్ సంగమం ఈ ప్రాంత శోభను ద్విగుణీకృతం చేస్తుంది. తొలి సూర్యకిరణాలు తిలకించడానికి పర్యాటకులు డాంగ్ గ్రామానికి సమీపంలో ఉన్న తేజు, వాలాంగ్ పట్టణాలలో బసచేసి తెల్లవారుఝూమున మూడుగంటలకే డాంగ్ గ్రామానికి ప్రయాణమౌతుంటారు.భారతదేశంలో చివరగా సూర్యాస్తమయం జరిగే ప్రదేశం గుజరాత్లో కచ్ జిల్లాలోని గుహార్ మోతీ. గుజరాత్ భారతదేశానికి పశ్చిమ దిక్కుగా ఉంది. జూన్మాసంలో అయితే ఇక్కడ రాత్రి 7.39 గంటలకు సూర్యుడు అస్తమిస్తాడు. ఉత్తర, దక్షిణ దృవాల భూమి 83 డిగ్రీలు కొద్దిగా వంగి ఉంటుంది.ఈ కారణంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరగడంతో ఉత్తర, దక్షిణ ధృవాల్లో సూర్యకాంతి పడుతూనే ఉంటుంది.అందువల్ల అక్కడి వారికి చీకటి అంటే ఏమిటో తెలియదు. అందువల్ల ఆయా ప్రాంతాలలో వాతావరణంతోపాటు ప్రజల జీవనవిధానం భిన్నంగా ఉంటాయి.
తొలి సూర్యోదయం ఎక్కడ?
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Vaartha-Sunday Magazine dergisinin September 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.