హెదర్ మేసన్, ఒక ప్రొఫెషనల్ యోగా థెరపీ శిక్షణా సంస్థ అయిన 'ది మైండెడ్ ఇన్స్టిట్యూట్' వ్యవస్థాపకురాలు మరియు డైరెక్టర్. ఆమె నాలుగు మాస్టర్స్ డిగ్రీల గ్రహీత. యోగా ద్వారా మనస్సు, శరీరం మరియు ఆత్మ వైపుకు తిరిగి రావడం, తన యోగాభ్యాసం ఆమె జీవితాన్ని ఎలా మార్చింది అనే దాని గురించి ఆమెతో రూబీ కార్మెన్ చేసిన ఇంటర్వ్యూ.
ప్రశ్న: శుభోదయం, హెదర్. హార్ట్ ఫుల్ నెస్ మ్యాగజైన్, ఈ ఇంటర్వ్యూకి ధన్యవాదాలు. యోగా మరియు యోగా థెరపీ మార్గంలో మిమ్మల్ని ఏది ప్రేరేపించింది?
మొదటి విషయం సాధన నుండి పొందిన అనుభూతి. మీరు మారడం వల్ల ప్రపంచం మారుతుంది.అవగాహనే సర్వస్వం. మీరు మానసిక ప్రక్రియలను, నాడీ వ్యవస్థను శాంతింపజేసి, అంతరంగాన్ని ఉత్తేజపరిచి మేల్కొల్పినప్పుడు, ప్రపంచం మారుతుంది. అప్పుడు మీరు విషయాలను మరింత స్పష్టంగా, మరింత సులభంగా చూడగలరు. అది జరిగినప్పుడు, అహం గురించి కాక, స్వీయ అనుభవం కోసం సహజమైన ప్రేరణ మరియు అభ్యాసం పట్ల ప్రేమ ఉత్పన్నమై, అది బాహ్య ప్రపంచం పట్ల కూడా జనిస్తుంది.
ఈ సాధనల ద్వారా గొప్ప కష్టాలను అధిగమించిన సహోద్యోగులు, విద్యార్థులు మరియు ఉపయోక్తల ద్వారా కూడా నేను లోతైన ప్రేరణ పొందాను.అన్నింటి కంటే ముఖ్యంగా స్వయం సాధన ద్వారా ప్రాపంచికమైన ఉచ్చులలో చిక్కుకోవడం సులభం. గొప్పవైనా లేదా చిన్నవైనా జీవితంలోని ఒడిదుడుకులు, ఉత్పన్నమయ్యే సమస్యలను బాహ్యీకరించడం మరియు ఆందోళన చెందడం చాలా సులభం. కాబట్టి, యోగా యొక్క ఆధ్యాత్మిక బోధనలు, మనకు ఇదివరకే తెలిసినప్పటికీ-వాటిని రూపొందించి, వాటి నుండి పోషణను పొందటం చాలా ముఖ్యం.
నేను బౌద్ధ ఆరామాలలో సుమారు మూడు సంవత్సరాలు ఉన్నాను. మీరు ఆ ప్రపంచంలో నివసించినప్పుడు, ప్రతి రోజు, ప్రతి క్షణం జ్ఞాపకం ఉంటుంది.అది మీరు ఆ వాతావరణంలో లేకున్నా, ఇతర వ్యక్తులతో కలిసి ఉండటం, విలువలను గుర్తు చేయడం, సాహిత్యం చదవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం వంటి చురుకైన ప్రక్రియను కలిగి ఉండటానికి సహాయపడుతుంది.కాబట్టి మీరు ప్రతిరోజూ ఆ ఆలోచనలను పెంచుకోండి. మీ పద్దతిని మీరే ఎంపిక చేసుకోవచ్చు; భౌతిక లాభం, ప్రతిష్ట, విజయంపై ఆధారపడిన ప్రపంచంలో మనం జీవిస్తున్నాము, అందులో అనేక కారకాలు ఉన్నందున నేను ఎటువంటి ఉపదేశాన్ని సూచించడం లేదు.దురదృష్టవశాత్తు, ఆ విషయాలను వెంబడించడం ఆనందానికి దారితీయదు.
Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Heartfulness Magazine Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap