మీ అలవాట్లలో చేసుకునే చిన్న మార్పులు మీతోపాటు కుటుంబాన్ని కూడా ఎంత ఆరోగ్యంగా ఉంచుతాయో ఇక్కడ చూడండి.
అలవాట్లే ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. అలవాట్లు ఎలా ఉంటే ఆరోగ్యం అలా ఉంటుంది. ఆచార, విచారాలే జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి.అలవాట్లకు ఆరోగ్యానికి గాఢమైన సంబంధం ఉంది. అందుకే హెూమ్ హైజీన్ అలవాట్లు మార్చుకోవాలి, మెరుగుపర్చుకోవాలి. ఇందుకోసం ఇంట్లో ఒక్కో మూలను ఎలా క్లీన్ చేయాలి. ఫ్లోర్, కిచెన్లను క్రిముల నుంచి ఎలా రక్షించాలి.2 ఇంటి ఆహార పానీయాలను చెడిపోకుండా ఎలా భద్ర పరచాలి, చేతుల శుభ్రత నుంచి బట్టల హైజీన్ వరకు అన్ని విషయాల మీద మీరు దృష్టి పెట్టాలి. వైరస్ల ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుకోడానికి ఇదే ఏకైక మార్గం. నేటి నుంచే మీ అలవాట్లను మెరుగుపరుచుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
ఫ్లోర్ క్లీనింగ్
ఇంటి నుంచి బయటికి వెళ్లి రావటం నిరంతరం జరిగేదే. ఇలాంటప్పుడు మురికి పాదరక్షల ద్వారా ఫ్లోర్ చాలా క్రిములు, వైరస్‌లకు ఆవాసమైపోతుంది. అందుకే దీన్ని రోజూ సరిగ్గా శుభ్రం చేయటం చాలా ముఖ్యం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇది మరింత అవసరం.ఎందుకంటే వారి మీద ఎంతగా కన్నేసి ఉంచినా ఎప్పుడో ఓసారి ఫ్లోర్‌పై పడిన పదార్థాలను తీసుకొని నోట్లో వేసుకుంటారు. అలాగే వాతావరణం మారినప్పుడు, ఫ్లూ సీజన్లో క్రిములు తమకు అనుకూలమైన ఉష్ణోగ్రత ఏర్పడితే విపరీతంగా ఎదిగిపోతాయి.
ఇలాంటప్పుడు రోజూ ఫ్లోరిని డిస్ ఇన్ఫెక్టెంట్తో క్లీన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది క్రీములు, వైరసిని చంపేస్తుంది. దీని ద్వారా ఫ్లోర్ మీద పేరుకుపోయిన మురికి తొలగిపోయి ఎలర్జీ అవకాశాలు చాలా తగ్గుతాయి. అంతేగాక దీని లేలేత సుగంధం ఇంటి వాతావరణాన్ని సంతోషభరితంగా ఉంచుతుంది.
ఇందుకోసం మీరు నీటిలో కొన్ని చుక్కలు డెటాల్ వేసి కూడా రోజూ ఫ్లోర్ క్లీన్ చేయొచ్చు లేదా మార్కెట్లో దొరికే డిస్ఇన్ఫెక్టెంట్ కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంట్లో ఏ మూలనో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి.
కిచెన్ హెల్త్ చాలా ముఖ్యం
అధ్యయనాల ప్రకారం కరోనా లాంటి వైరస్లు కొన్ని కిచెన్ ఉపరితలాల్లో గంటల నుంచి ఒక రోజు వరకు జీవించి ఉంటాయని తేలింది. కార్డ్ బోర్డ్ పై 24 గంటలు, స్టెయిన్లెస్ స్టీల్‌పై 2 రోజులు, కాపర్ మీద 5-6 గంటలు, ప్లాస్టిక్‌పై 3 రోజులు ఉంటాయి.
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin July 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.