మారుతున్న సీజన్లు మన మూడ్పై చూపించే ప్రభావాలను తెలుసుకుంటే ఆశ్యర్యపోతారు..
వర్షాల సీజన్లో పిల్లలు బయటికొచ్చి వ ఆడటం, ఎగరటం ఆగిపోతుంది.
అందుకే వాళ్లు ' రెయిన్ రెయిన్ గో అవే... అంటారు. అదే విధంగా అధిక వేడి లేదా ఆకు రాలే కాలంలో ఇబ్బంది పడుతూ ఈ సీజన్ ఎప్పుడు మారిపోతుందా అనుకుంటాము. రుతువులకు ఒక చక్రం ఉంటుంది. భౌగోళిక ప్రదేశాలను బట్టి ఈ రుతువులు ప్రభావాన్ని చూపుతాయి. నిజానికి ఈ రోజుల్లో క్లైమేట్ చేంజ్ కారణంగా అకాలంగానే వాతావరణంలోనే అనేక ఆకస్మిక మార్పులు చూస్తున్నాము.
ఏదైనా సీజన్లో అధిక వర్షం, అధిక వేడి లేదా అధిక చలి ఎక్కువకాలం ఉంటే మనం ఆందోళనతో కుంగిపోతుంటాము. కానీ ఇది మనసులో జరిగే మార్పేనా? నిజంగా రుతువుల ప్రభావం మనసు మీద పడుతుందా? 70 దశకం చివర, 80ల ప్రారంభంలో దీని గురించి శాస్త్ర వేత్తలు అనేక అధ్యయనాలను బయట పెట్టారు.
రుతువులకు మూడో సంబంధం : ఈ సంబంధం చాలా ఇబ్బందికరమైనది. దీన్ని డల్నెస్, నీరసం, అయిష్టం వంటి అనేక రకాలుగా వర్ణించవచ్చు. సైన్సు ప్రకారం సీజన్కి, మూడ్స్కి గల సంబంధంలో అనేక వాదాలు ఉన్నాయి.చాలా తర్క వితర్క సిద్దాంతాలు చెబుతుంటారు.1984లో శాస్త్రవేత్తలు మూడ్ చేంజ్పై అనేక కోణాల్లో పరిశోధనలు చేసారు. దీని ప్రకారం మూడ్స్ మార్పులు ఉదాహరణకు క్రోథం, సంతోషం, దిగులు, ఆశ, నిరాశ లేదా ఆవేశ పూరిత ప్రవర్తన వంటివి ఎండ, ఉష్ణోగ్రత, గాలి, హ్యుమిడిటీ, వాతావరణంల హెచ్చు తగ్గుల వల్ల కలుగుతుంటాయి.
అధ్యయనాలు చెప్పిందేమిటంటే ఎక్కువగా మూడ్ని ప్రభావితం చేసేవి సరైన్ లేదా ఎండ, వేడి, హ్యుమిడిటీ. ముఖ్యంగా గాలిలో తేమ అధికమైతే ఏకాగ్రత తగ్గుతుంది, పడుకోవాలి అనిపిస్తుంది. 2005 నాటి ఒక అధ్యయనం ప్రకారం మంచి వాతావరణంలో బయట తిరగటం లేదా సమయం గడపాలనే మూడ్ కలుగుతుంది. పైగా జ్ఞాపకశక్తి కూడా అధికంగా ఉంటుంది.
గుడ్ అండ్ బ్యాడ్
వసంత రుతువులో మూడ్ చాలా బాగుండటం, వేసవిలో చెడిపోవటం గమ నించొచ్చు. కానీ కొందరు సైంటిస్టులు దీన్ని అంగీకరించట్లేదు. వారు 2008లో వేరేగా అధ్యయనం చేసారు. దీని ప్రకారం ఎండ, ఉష్ణోగ్రత, గాలిలో తేమ మూడ్పైన స్పెషల్ పాజిటివ్ లేదా నెగెటివ్ ప్రభావాన్ని చూపట్లేదు.ఒకవేళ ఉన్నా అది నామ మాత్రమే. అంతేగాక 2005లోని అధ్యయనం ప్రకారం మంచి వాతావరణం చాలా తక్కువగానే పాజిటివ్ మూడ్ని కలిగిస్తుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin November 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.