వయస్సు ముప్పైలో పడ్డ తర్వాత ఈ పెట్టుబడి పద్ధతులు
మీ భవిష్యత్తుకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ప్ర స్తుత కాలం అనిశ్చితులతో నిండి ఉంది. కొన్నిసార్లు అంటువ్యాధుల దాడి, ఇంకొన్నిసార్లు ఉపాధి సంక్షోభం యువత సంపన్న, సంతోషకర జీవితానికి ఆటంకం కలిగిస్తాయి. ఇలాంటి సమయంలో స్మార్ట్ పెట్టుబడి అంటే సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి మాత్రమే జీవితంలో ఆర్థిక పునాదిని బలంగా మారుస్తుంది.
కాబట్టి యువత తమ కోసం సులభమైన, సురక్షితమైన, ఉత్తమమైన పెట్టుబడి ఎలా ఎంచుకోవాలో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ రాజేంద్ర మిశ్రా ద్వారా తెలుసుకుందాం.
వీటి జాగ్రత్త
‘క్రిప్టో కరెన్సీ' చాలా అస్థిరమైనది. దీనిపై ప్రభుత్వానికి ఇంకా స్పష్టమైన నియంత్రణ లేదు. అందుకే ఇందులో పెట్టుబడి పెట్టకండి.
• అత్యాశ, త్వరగా సంపాదించాలన్న కోరికతో బెట్టింగ్, చిట్ ఫండ్స్లో డబ్బులు పెట్టకండి.
• ఒక ప్రణాళిక లేకుండా ఇన్వెస్ట్ చేయకండి.
• ఒకే చోట పెట్టుబడి అంతా పెట్టడం మంచి పని కాదు.
స్టెప్ 1 - టర్మ్ ఇన్సూరెన్స్
30 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మనం బాధ్యతలు అర్థం చేసుకోవడం మొదలు పెడతాం. ఈ సమయంలో మనం వేయవలసిన మొదటి, అతి ముఖ్యమైన అడుగు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఏమీ జరుగుతుందో చెప్పలేము.
ఎప్పుడు జీవితానికి వీడ్కోలు చెబుతామో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో అసలైన జీవిత బీమా ప్లాన్ అంటే అది టర్మ్ ఇన్సూరెన్స్. ఇది మీరు చనిపోయిన తర్వాత మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. దీని 'పాలసీ వ్యవధి'లో బీమా చేసిన వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే బీమా పాలసీలో పేర్కొన్న నామినీకి ఏక మొత్తంగా డబ్బు లభిస్తుంది.
కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు ఎంతో ముఖ్యమైనదిగా మారింది. ఎంత త్వరగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం చెల్లించాలన్నది మీరు గుర్తుంచుకోవాలి.
బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా ఎంచుకోవాలి
• ఎప్పుడైనాసరే కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో పరిశీలించాలి. కుటుంబంలో కష్టాలు వచ్చినప్పుడు కంపెనీ ఎంత సమయంలో క్లెయిమ్ సెటిల్ చేస్తుందో అన్నది దీంతో తెలుసుకోవచ్చు. లేకపోతే కుటుంబం చాలా సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.
స్పై యాక్షన్ థ్రిల్లర్
ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు
కొత్త కథతో నాగార్జున
కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.
ఇండియన్ మెగాస్టార్
' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
'బేబీ జాన్' లో యాక్షన్ రోల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు.
డ్యాన్సింగ్ క్వీన్
తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.
నేషనల్ క్రష్
పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్‌గా, టోన్గా మార్చుకుంది.
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.