శ ర్మిష్ట పెళ్లయిన తర్వాత లక్నో నుంచి ఢిల్లీకి వచ్చింది. విశాలమైన గార్డెన్ ఉన్న ఇల్లు వదిలి అత్తారి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లో నివసించటం కష్టంగా అనిపించింది. మూడో అంతస్తులో ఆమెకు త్రిశంకులో ఉన్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే భవనంలో పైకి, కిందికి ఎటూ వెళ్లే స్వేచ్ఛ ఉండదు. ఇంట్లో సూర్యరశ్మి పడటం కూడా కష్టమే.
శర్మిష్ట బాల్యం నుంచి యుక్త వయసు వరకు గడిపిన ప్రదేశంలో వారికి ఒక భవనం ఉండేది. ఎదురుగా గార్డెన్, వెనుక కూడా పచ్చని తోట కనపడేది. ప్రతి గదిలో కిటికీలున్నాయి.గాలి, వెలుతురు హాయిగా వస్తుండేవి. ఇంటి మధ్య విశాలమైన ప్రాంగణం ఉండేది. ఉదయాన్నే సూర్యుని తొలి కిరణాలు తాకేవి. అలాంటి ప్లేసు నుంచి వచ్చి, ఇప్పుడు అత్తారింట్లో ఇరుకు ఫ్లాటులో ఇమడటం కష్టమైంది బాల్కనీలోకి వచ్చి గాఢంగా శ్వాస పీల్చే ప్రయత్నం చేసేది.
ఇప్పుడైతే ఇక ఆమె నివాసం ఇదే అవుతుంది.ఎందుకంటే ఢిల్లీ లాంటి ప్లేసులో స్థలాలు కొనే ఆలోచనే కష్టమైనది. అందుకే బాల్కనీకి తనకు నచ్చిన గార్డెన్ కనపడే మంచి లుక్కుని ఇచ్చేందుకు ప్రయత్నించింది. వెంటనే చిన్న చిన్న కుండీల్లో మొక్కల్ని నాటడం మొదలుపెట్టింది.
ఇంట్లో వ్యర్థంగా వదిలేసిన వస్తువుల్ని సేకరించి, పెయింట్ వేసి వాటిలో సీజనల్ ఫ్లవర్స్ వచ్చే మొక్కల్ని నాటింది. అలాంటివి కొన్ని బాల్కనీలో అక్కడక్కడ వేలాడదీసింది. రేలింగ్ వీటితో డెకరేట్ అయిపోయింది. పాత వస్తువుల్ని బెస్ట్ మార్చి మొక్కల్ని పెట్టి అలంకరించింది.ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. మధ్య మధ్యలో వెరైటీ రంగుల బల్బులు అమర్చింది.అంతేగాక గాలికి కదిలి సుందరమైన శబ్దాలు స్మాల్ బెలిని వేలాడదీసింది.
బాల్కనీకి ఓ మూలన తులసి, సదా బహార్, స్వీట్ నీమ్ లాంటి మొక్కల్ని కుండీల్లో పెట్టింది.అవి చాలా గ్రీనరీని తీసుకొచ్చాయి. క్రమంగా వారి బాల్కనీ లుక్కు మారిపోయింది. ఒక రోజు శర్మిష్ట మార్కెట్ నుంచి నకిలీ గ్రాస్ ఉండే కార్పెట్ తెచ్చింది. దాన్ని బాల్కనీలో పరిచి దాని మీద 2 వెదురు కుర్చీలు, ఒక చిన్న టేబుల్ అమర్చింది.
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్‌లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్‌లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్‌లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు