న్యూ ఇయర్ అనగానే ప్రతి వ్యక్తి ఏదో కొంత కొత్తదనాన్ని వెతుకుతారు.ముఖ్యంగా గృహిణులు ఇంటిని తీర్చిదిద్దే చింతలో నిమగ్నమవుతారు. కొత్త ఏడాది ఇంట్లో ఏవి మార్చేసి ఆకర్షణీయమైన లుక్కుని తీసుకురావచ్చు? కొత్తగా ఏవి సర్దితే ఇల్లు చూడగానే వావ్ అనిపిస్తుంది? అనే ముఖ్యమైన విషయాలు. అన్నింటికంటే మొదట డ్రాయింగ్ రూమ్‌ని చూడాలి. ఇక్కడే అతిథులు, భర్త స్నేహితులు వచ్చి కూర్చుంటారు.
వారు డ్రాయింగ్ రూమ్ లుక్కుని చూసి ఇల్లాలి అభిరుచి, సృజనాత్మకతని అంచనా వేస్తారు. అందుకే ఎక్కువ శాతం మహిళలు న్యూ ఇయర్లో సోఫా, పరదా, తివాచీలు కొత్తగా తెచ్చి లుక్కుని మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఇంటీరియర్ డెకరేటర్స్‌తో కూడా చాలా సూచనలు తీసుకుంటారు. వీటన్నింటికి చాలా డబ్బు ఖర్చు చేస్తారు.
కానీ ఈ కొత్త సంవత్సరంలో ఖర్చు ఎక్కువ లేకుండానే ఇంటి లుక్కుని అట్రాక్టివ్ గా మార్చే కళాత్మక పద్ధతుల గురించి ఇక్కడ తెలుసుకోండి.వీటిని పాటిస్తే నలుగురిలో ప్రశంసలు కూడా పొందుతారు. బంధువుల మధ్య మీ గౌరవం పెరుగుతుంది. తోటి వారితో మీ సాన్నిహిత్యం అధికమవుతుంది. అవేమిటో చూద్దాం రండి.
గదిలో శోభ పెంచటం
సాధారణంగా మధ్య తరగతి లేదా హై క్లాస్ గృహాల్లో అడుగు పెట్టగానే అందమైన ఫర్నీచర్, పరదాలు, షోపీసులు డ్రాయింగ్ రూమ్‌లో అలం కృతమై కనిపిస్తాయి. బంగ్లా, భవంతుల్లో కూడా మొదట పెద్ద గది సిట్టింగ్ కోసం మంచి సోఫా సెట్, సెంట్రల్ టేబుల్‌తో అలంకరించి ఉంటుంది. కిటికీలకు తలుపులకు మెరిసే పరదాలు, సైడ్ టేబుల్ మీద షోపీసులు, ఫ్లవర్ పాట్ లేదా ఇన్డోర్ ప్లాంట్స్ గదిని శోభాయమానం చేస్తాయి.
ఈ రోజుల్లో టూ, త్రీ బీహెచ్ ఫ్లాట్స్‌లో ఒక పెద్ద హాల్లో పార్టిషన్ చేసి ముందువైపు డ్రాయింగ్ రూమ్, వెనుక భాగాన్ని డైనింగ్ రూముగా మలుస్తున్నారు.
కొన్ని చోట్ల రెండు పోర్షన్ల మధ్య పరదాలు వేసి వేరే లుక్కునిస్తున్నారు. కొందరికీ ఇవేవీ చేయాల్సిన అవసరం ఉండదు. డ్రాయింగ్, డైనింగ్ ఒకే హాలులో పెట్టేస్తారు.
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Telugu dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.