ఒంపులు తిరిగిన రహదారిలో పచ్చ ని చెట్ల మధ్య ప్రయాణం.. గుభాళించే గంధపు పరిమళాల ఆత్మీయ ఆహ్వానం.. ప్రయాణపు అలసటను చల్లార్చే ప్రకృతి సోయగాలు అక్కడ అనేకం.. ఓవైపు తలకోన జలపాతాల సవ్వడులు మంత్రముగ్ధుల్ని చేస్తుంటే.. మరోవైపు హార్సిలీహిల్స్ లోని సహజసిద్ధమైన పచ్చని చెట్లు..వాటికి పూసిన పూల పరిమళాలు మనల్ని అక్కున చేర్చుకుంటున్నాయి. ఇలా ఎన్నో రమణీయ అందాలతో ఈ ప్రాంతం విహారయాత్రకు చిరునామాగా నిలుస్తోంది. పర్యాటకుల విడిది కేంద్రంగా పేరొందిన ఈ ప్రాంతపు విహార అనుభవాలు మీకోసం.
ఉదయం ఏడయ్యింది. మా మిత్రబృందంతో కలసి తిరుపతి ఆర్టిసి బస్టాండ్ దగ్గరకు వెళ్ళాం.అప్పటికే జనం గుంపుగా ఉన్నారు. బస్టాండ్ అన్నాక ఆ మాత్రం ఉంటారులే అనుకున్నాం.అలా పదినిమిషాలకు పొగలు కక్కుతూ ఓ సింగిల్ డోర్ బస్సు వచ్చి ఆగింది. అంతే ఒక్క ఊపున ఆ గుంపంతా ఒకరినొకరు నెట్టుకుంటూ ఎక్కడం మొదలుపెట్టారు. అప్పుడర్థమైంది.వారాంతా మేం ఎదురుచూస్తున్న బస్సు బాధితు లేనని. ఆ జనంతోపాటే మేమూ ఎలాగోలా బస్కెక్కేశాం.
అన్నట్లు చెప్పడం మర్చిపోయాను! మేం తిరుపతి నుండి తలకోన వెళ్తున్నాం. నేరుగా ఇక్కడి నుండి తలకోన వెళ్ళే ఒకే ఒక్క బస్సు ఇది. 'అందరూ ఎక్కారా? రైట్..రైట్..!' అంటూ కండక్టర్ ఓ కేక వేశాడు. అంతే, బస్సు వదిలిన పొగకు వెనకాల ఉన్న వాహనాలు అదృశ్యమైపోయాయి. బస్సు ఎక్కేటప్పుడు ఫుట్పాత్ పైన ఓ అడుగు వేశాం.అంతే, రెండో అడుగు వేసేందుకు అవకాశం లేదు. అంతలా విద్యార్థులతో బస్సు నిండి పోయింది. ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసు కుంటున్న వారి మధ్య సంభాషణలు వింటుంటే ఒకప్పడి చదువుకున్న పల్లెటూరి వాతావరణం గుర్తొచ్చింది.
దారి పొడవునా ఒంపులు తిరిగిన రోడ్డు
هذه القصة مأخوذة من طبعة March 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 2023 من Telugu Muthyalasaraalu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు