నరసింహుడు... అనగానే మన కళ్ళముందు మెదిలేది ఉగ్రరూపం. ఆ రూపాన్ని చూడగానే భయపడతాం. కాళీ అమ్మో! భయానక రూపం. ఆ పేరు వింటేనే భయపడతాం.పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తిని చూసి దొంగ భయపడి పారిపోతాడు. కానీ, పోలీసు దుస్తుల్లో ఉన్నది తన తండ్రే అని గ్రహించిన పిల్లవాడు భయపడకుండా దగ్గరికి వెళ్ళి తనను ఎత్తుకోమని మారాంచేస్తాడు. మన భయానికి కారణం ‘ఆ భగవంతుడే మన తల్లి, తండ్రి' అని తెలియకపోవడమే!
ఈ ముల్లోకాల్లో తనను జయించేవాడే లేడని అహంకరించిన హిరణ్యకశిపుడు నరసింహుడి ఉగ్రరూపాన్ని చూసి భయకంపితుడయ్యాడు. ప్రహ్లాదుడు మాత్రం ప్రశాంతంగా ఉగ్రనరసింహుని ఒడిలో కూర్చోగలిగాడు. మన ఇళ్ళల్లో కనీసం చిత్రపటాన్ని పెట్టుకోవడానికి కూడా భయపడే కాళికాదేవిని తన ఆరాధ్యదైవంగా కొలిచి, ప్రసన్నం చేసుకున్నారు శ్రీరామకృష్ణులు.
భయంలేని భక్తి : ప్రహ్లాదుడుగానీ, శ్రీరామకృష్ణులుగానీ తమ ఇష్టదైవాల ఉగ్రరూపాన్ని చూసి భీతిల్లలేదు. పులి వేషధారణలో వచ్చినది తన తండ్రే అని తెలిసిన పిల్లవాడు భయపడడు కదా! అలాగే, భగవంతుడు ఉగ్రరూపంలో ఉన్నట్లు కనిపించినా అతడు తన తల్లి, తండ్రి అని గ్రహించిన భక్తునికి భయమెందుకు కలుగుతుంది!? ఉగ్రనరసింహస్వామిని చూసి ప్రహ్లాదుడు భయపడ కుండా స్వామితో సంభాషించాడు. ప్రహ్లాదుని భక్తికి మెచ్చి నరసింహస్వామి 'నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను' అని అన్నప్పుడు ప్రహ్లాదుడు 'స్వామీ! నీ ఉగ్రరూపాన్ని చూస్తే నాకెలాంటి భయం కలుగలేదుగానీ, నీవు సృజించిన మాయను చూస్తే మాత్రం భయం కలుగుతుంది. కావున దేవా! కామక్రోధాది అరిషడ్వర్గాలనే నీ మాయలో పడకుండా నన్ను అనుగ్రహించు' అని ప్రార్థించాడు. అలాగే, పిల్లలు తన తల్లితో మాట్లాడినట్లు శ్రీరామకృష్ణులు కాళీమాతతో మాట్లాడేవారు. ఆమెతో ఆడారు, పాడారు. అమ్మే తన లోకంగా జీవించారు.
ప్రహ్లాదుడు ఆ భగవంతుడే తన తల్లీ, తండ్రీ అని పరిపూర్ణంగా విశ్వసించాడు, సంపూర్ణ శరణాగతి భావంతో జీవించాడు. అలాగే, శ్రీరామకృష్ణులు జగత్తంతా జగన్మాత మయంగా గాంచారు. సర్వకాల సర్వావస్థలయందు ఆ భగవంతుణ్ణి గాంచేవారిని చూసి భయమే భయపడి పారిపోతుంది.
هذه القصة مأخوذة من طبعة April 2023 من Sri Ramakrishna Prabha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة April 2023 من Sri Ramakrishna Prabha.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద