ఆర్థిక ఒత్తిడి కారణంగా సెక్స్ కోరిక నశిస్తున్న పరిస్థితిలో లైంగిక జీవితాన్ని తిరిగి పట్టాలపై ఎక్కించడానికి ఏం చేయాలి...
సెక్స్ కేవలం శారీరక స్పందన కాదు.ఇందులో భావోద్వేగ అనుబంధం కూడా ముఖ్యమైనది. ఆర్థిక ఒత్తిడి ప్రభావం భావోద్వేగ స్థాయిపై పడుతుంది.ఆందోళనకు గురైన మనసు శరీరానికి పూర్తిగా మద్దతునివ్వదు. దాంతో లైంగిక జీవితం ప్రభావిత మవుతుంది. దీని ప్రభావం భార్యాభర్తల పైనే కాదు కుటుంబం, పిల్లలు, సమాజంపైనా ఉంటుంది. లైంగిక జీవితం సరిగా లేకపోతే అది వ్యక్తి సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
రకరకాల ఒత్తిడిలు లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందులో ఆర్థిక ఒత్తిడి ఆ వ్యక్తిని మాత్రమే కాదు, వారి జీవిత భాగస్వామినిసైతం ప్రభావితం చేస్తుంది. డబ్బు లేకపోతే డాక్టర్‌కి, మందులకు ఇబ్బంది పడతారు.
భాగస్వామిని సంతోషపెట్టడానికి బహుమతులు ఇవ్వడం లేదా వారిని షికారుకు తీసుకువెళ్లడం కష్టమవుతుంది. సంవత్సరాలుగా కలిసి ఉన్నా సరే వారు లోపాలు వెతకడం మొదలుపెడతారు.
కోవిడ్ 19 సమయంలో ఆర్థిక ఒత్తిడి ఏర్పడడానికి అతి పెద్ద కారణాల్లో ఇంటి అద్దె చెల్లించడం, ఉద్యోగం వదిలివేయడం, పూర్తి జీతం పొందకపోవడం, సమయానికి వేతనం అందకపోవడం లాంటివి ముఖ్యమైనవి.
కంపెనీలు తమ ఉద్యోగి జాబ్ వదిలి వెళ్లి పోవడానికి రకరకాల సాకులు చెప్పి వేధిస్తాయి. ఆర్థిక మాంద్యం పరోక్షంగా సెక్స్న ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా భార్యాభర్తల మధ్య సహజ సంబంధం క్షీణిస్తుంది.
సామాజిక జీవితంపై ప్రభావం
ఆర్థిక సంక్షోభంలో ప్రజలు పెద్ద నగరాలు, పెద్ద ఇళ్లలో నివసించే మంచి ప్రాంతాలు వదిలేసి, తక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రదేశాల్లో నివసించవలసి వచ్చింది. పిల్లలను మంచి స్కూళ్ల నుంచి తక్కువ ఫీజు వసూలు చేసే పాఠశాలకు మార్చవలసి వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల ప్రభావం సామాజిక జీవితంపై పడుతుంది. అదే ఒత్తిడికి పెద్ద కారణమవుతుంది.
మహిళలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఆమె భర్తతో సెక్స్ సంబంధం పెట్టుకోలేదు. ఎన్నోసార్లు భర్త చొరవ తీసుకున్నా భార్య నిరాకరిస్తుంది.
ఆర్థిక ఒత్తిడిని అంతం చేయడానికి ప్రజలు పని ఎక్కువ చేయడంతో వారికి సెక్స్‌కి సమయం కూడా దొరకడం లేదు. పనితో వారు అలసి పోతారు. లైంగిక సంబంధాల సమస్య అలాగే ఉండిపోతుంది.
هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.