ఒకవైపు సైన్సుని ఉపయోగిస్తూ ప్రగతి సాధిస్తూనే మరోవైపు మూఢ నమ్మకాలు, దురాచారాలతో మన ఆలోచనల్ని మరింత సంకుచితంగా మార్చేస్తున్నాము...
నే ను పురుషుడిని అయినందున మహిళలకు వచ్చే రుతుచక్రం గురించి ఎలాంటి భయం లేదు.కానీ మా అక్కకి జరిగిన 2 సంఘటనలు నా మనసును కుదిపేయటమేగాక స్త్రీలపైన శ్రద్ధ మరింత పెంచాయి.
మా అక్క నా కంటే 5 ఏళ్లు పెద్ద. ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడు ఒక రోజు హఠాత్తుగా స్కూలు నుంచి ఇంటికి వచ్చేసింది. ఆమె ముఖంలో రంగు మారిపోయింది. తన కుర్తా వెనుక భాగంలో రక్తపు మరకలున్నాయి. నీళ్లతో కడగటం వల్ల డ్రెస్సు అంతా తడిసిపోయింది.ఏమిటని అడిగితే మాట దాట వేసింది, కానీ అమ్మ నన్ను మందలించి నోర్మూయించింది.
పెద్దయ్యాక నిదానంగా నేను తెలుసుకున్నాను. ఆ రోజు అక్కకు ఏం జరిగిందో అర్థమైంది. ఆ పరిస్థితిని తలచుకుని ఇప్పటికీ వణుకుతుంటాను.
బాల్యంలోని మరో ఘటన గుర్తొస్తోంది.మా అక్క పెళ్లయ్యాక తొలిసారి నేను వారింటికి వెళ్లాను. ఉదయం అక్క నేలపై పడుకొని ఉంది.బావ మంచంమీద ఉన్నాడు. దీని గురించి అక్కని అడిగితే ఆమె సింపుల్గా స్త్రీలకు రుతుచక్రం వచ్చినప్పుడు దూరంగా ఉంచుతారు, కనుక నేలపై పడుకోవాలి అంది.
ఆ సమయంలో తన మాటలు ఎంతో విడ్డూరంగా అనిపించాయి. కానీ నేను మాత్రం ఏమి చేయగలను. అందుకే మౌనం వహించాను.ఇప్పుడైతే పెద్దయ్యాను. కనుక దీని గురించి రాసి మూఢనమ్మకాల్ని సమాప్తం చేయాలి అనుకున్నాను. అందుకే ఈ వ్యాసాన్ని ఇలా మీ ముందుకు తెస్తున్నాను.
సామాన్య ప్రక్రియ
జీవిత చక్రంలో ప్రతి మహిళ నెలసరిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది చాలా సాధారణ ప్రక్రియ. కానీ ధార్మికంగా ఈ విషయంలో మహిళల్ని అపవిత్రులుగా చూస్తుంటారు.
రుతుచక్రం వల్ల మహిళ అంటరానిదే అనుకుంటే ఈ ప్రపంచంలోని స్త్రీ పురుషులందరూ అపవిత్రులే. ఎందుకంటే పుట్టేటప్పుడు ప్రతి శిశువు అదే రక్తంతో తడిసి ఉంటుంది.
ఓపెన్ మైండ్తో ఆలోచిస్తే నెలసరి సమయంలో స్త్రీని తన నుంచి వేరుగా ఉంచటం పురుషుని మిథ్యా అహంకారాన్ని పెంచుతుంది.ఇంతకు మించి ఏమీ ఉండదు. దీనికి చాలావరకు హైందవ పురాణాలు కారణమవుతాయి.పురాణాల్లోని ఒక కథ ప్రకారం ఇంద్రుడు తన పాపాల్లో భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడట. దీనివల్లే మహిళలకి ప్రతి నెల నెలసరి బాధ ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
హార్మోన్స్లో మార్పులు
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 2023 من Grihshobha - Telugu.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.