తెల్లవారు జామున చింకీ తేనెటీగ తన స్నేహితులతో కలిసి రోజు మాదిరిగానే ఆహారం కోసం బయలుదేరింది. వారు పువ్వుల మీద వాలుతూ ఒక్కో దాని నుంచి మకరందం సేకరించి దాన్ని తేనె తుట్టెలో నింపేవారు. ఒక రోజు స్నేహితురాలు మిమీతో చింకీ “ప్రతి రోజు ఉదయాన్నే లేచి, ఆహారం కోసం బయటికి వెళ్లడం, స్నేహితుల కోసం తీసుకురావడం నాకు బోర్గా, మార్పు లేనిదిగా అనిపిస్తోంది" అని చెప్పింది. “తేనెటీగలు ఎప్పుడూ ఇదే అనుసరిస్తాయి. ఇప్పుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నదేమిటి?” అడిగింది మిమీ.
“ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే రకమైన పనులు చేస్తూ బిజీగా ఉండటం నాకు ఇష్టం లేదు.మనకు స్వంత జీవితాలు ఉన్నాయి.నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉండాలి" అంది చింకీ.
"తేనెటీగలు సామాజిక జీవులు.మనం ఒక సమూహంగా కలసి పని చేస్తాం. మనం ఆహారం తెచ్చినప్పుడు మన స్నేహితుల్లో చాలామంది తేనె తుట్టెను శుభ్రం చేస్తూ బిజీగా మారిపోతారు. నాకు ఈ పనిలో ఎంతో సంతృప్తి లభిస్తోంది. ఈ రోజు నీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది?”
అయోమయంగా అడిగింది మిమీ. 'సీతాకోక చిలుకలు, చిమ్మెటలను చూడు. అవి తమ కోసం జీవిస్తాయి. నచ్చినట్లు పని చేస్తాయి. అవి మనకు పూల మకరందాన్ని ఇస్తాయి కానీ మనం కష్టపడినట్లుగా అవి జీవించవు" చింకీ వివరించింది.
“ప్రతి జాతి తనదైన పని తీరు కలిగి ఉంటుంది. సీతాకోక చిలుకలు, చిమ్మెటలు ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటాయి. అలానే జీవితాన్ని కొనసాగిస్తాయి. మనం కాలనీల్లో నివసిస్తూ అందరితో కలిసి ఉంటాం” చెప్పింది మిమీ.
“మనం ఆహారాన్ని త్వరగా సేకరించడానికి, మనకంటూ కొంత సమయం తీసుకోడానికి ఏదైనా మార్గం ఉంటే బాగుండు" నిట్టూరుస్తూ చెప్పింది చింకీ.
“నువ్వు త్వరగా ఆహారం సేకరించాలంటే స్వీట్ షాప్కి వెళ్లవచ్చు. అక్కడ తినడానికి కావలసినంత చక్కెర పాకం లభిస్తుంది. కొద్దిసేపట్లో నీ పని పూర్తవుతుంది. తిరగడానికి సమయమూ దొరుకుతుంది” సలహా ఇచ్చింది మిమీ జోక్ చేస్తూ.
Diese Geschichte stammt aus der November 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der November 2023-Ausgabe von Champak - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో