దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Express Telugu Daily|October 10, 2024
దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు.
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణ వార్తను టాటాసన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ధ్రువీకరించారు. రతన్ టాటా మరణ వార్తతో రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధనఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రతన్ టాటా మరణవార్త తెలిసిన వెంటనే బ్రీచ్ క్యాండి ఆసుపత్రికి రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వెళ్లారు. రతన్ టాటా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 1937 డిసెంబర్ 28న ముంబయిలో నావల్ టాటా- సోనీ టాటా దంపతులకు జన్మించిన రతన్ టాటా.. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1975లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. తన డిగ్రీ పూర్తి కావడంతో రతన్ టాటా.. 1962లో టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో, ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన.. టాటా గ్రూప్ నకు నేతృత్వం గ్రూప్ నకు రతన్ టాటా ఛైర్మన్ గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ను, 2008లో రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణను ప్రకటించింది.

రూ.10 వేల కోట్ల నుంచి రూ. లక్షల కోట్ల వరకు..

Diese Geschichte stammt aus der October 10, 2024-Ausgabe von Express Telugu Daily.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS EXPRESS TELUGU DAILYAlle anzeigen
రైతులకు రెండు లక్షల రుణమాఫీ షరతులు లేకుండా చేయాలి
Express Telugu Daily

రైతులకు రెండు లక్షల రుణమాఫీ షరతులు లేకుండా చేయాలి

రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఎలాంటి షరతులు నిబంధనలు లేకుండా వర్తింప చేయాలని బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పల్లె గడ్డ నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

time-read
1 min  |
October 10, 2024
అగ్గి తెగుళ్లను ఎలా నివారించాలి
Express Telugu Daily

అగ్గి తెగుళ్లను ఎలా నివారించాలి

వ్యవసాయ అధికారిణి రామడుగు వాణి

time-read
1 min  |
October 10, 2024
పేదరికం లేని ప్రపంచాన్ని కోరుకున్న విశ్వ మానవుడు చేగువేరా
Express Telugu Daily

పేదరికం లేని ప్రపంచాన్ని కోరుకున్న విశ్వ మానవుడు చేగువేరా

డివైఎఫ్ఎస్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ ప్రపంచ యూత్ ఐకాన్ చేగువేరా ఆశయాల కోసం ఉద్యమిద్దాం డివైఎఫ్ఎస్ఐ మండల కార్యదర్శి దాసరి మహేందర్

time-read
1 min  |
October 10, 2024
పండగ పూట కూడా పస్తులు ఉంటున్న మిషన్ భగీరథ కార్మికులు
Express Telugu Daily

పండగ పూట కూడా పస్తులు ఉంటున్న మిషన్ భగీరథ కార్మికులు

కూసుమంచి మండలం పాలేరులో మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కుసుమంచి మండలంలోని కార్మికులు పాలేరు

time-read
1 min  |
October 10, 2024
అధికారుల అండతో లీగల్ గా దోచేస్తున్నారు...?
Express Telugu Daily

అధికారుల అండతో లీగల్ గా దోచేస్తున్నారు...?

ఇసుక మాఫియా గాళ్ళకు అధికారికంగా దోచిపెడుతున్న అధికారులు?

time-read
2 Minuten  |
October 10, 2024
సామాజిక సేవకర్త ఎం.ఏ హకీం సేవలు మరువలేనివి
Express Telugu Daily

సామాజిక సేవకర్త ఎం.ఏ హకీం సేవలు మరువలేనివి

శ్రేయశీలి, పేదల మిత్రుడిని ఘనంగా సన్మానించిన దోస్తులు

time-read
1 min  |
October 10, 2024
మండలి చీఫ్ విప్ పట్నం బాధ్యతలు స్వీకరణ
Express Telugu Daily

మండలి చీఫ్ విప్ పట్నం బాధ్యతలు స్వీకరణ

అభినందనలు తెలిపిన పలువురు నేతలు

time-read
1 min  |
October 10, 2024
ఎస్సీ వర్గీకరణ చేయకుండా డిఎస్సీ నియామకాలు
Express Telugu Daily

ఎస్సీ వర్గీకరణ చేయకుండా డిఎస్సీ నియామకాలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆందోళన ఇందిరాపార్క్ వద్ద మందకృష్ణను అడ్డుకున్న పోలీసులు

time-read
1 min  |
October 10, 2024
కాంగ్రెస్్వన్నీ విభజన రాజకీయాలు
Express Telugu Daily

కాంగ్రెస్్వన్నీ విభజన రాజకీయాలు

హర్యానా ఫలితాలపై వక్రభాష్యాలు.. మండిపడ్డ ప్రధాని మోడీ

3 Minuten  |
October 10, 2024