మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన పెద్దలు 80,90 సంవత్సరాలు.జీవించడం సాధారణంగా ఉండేది.ఇప్పుడు 60,70 సంవత్సరాలు జీవిస్తే అదే గొప్ప భాగ్యంగా భావించాల్సి వస్తుంది. మారిన మన ఆహారపు అలవాట్లను బట్టి మన ఆరోగ్యం అత్యంత ప్రమాదంలో ఉందని చెప్పక తప్పదు.చేతినిండా డబ్బు ఉంది. దీంతో కృత్రిమ భోజనం వైపు పరుగులు తీస్తున్నాం.బర్గలు, పిజ్జాలు తినడం మామూలు అయిపోయింది. పోషకాలు, పండ్లు, కూరగాయలపై శ్రద్ధ చూపించకపోతే మరింత ముప్పు ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండె, మెదడు భద్రంగా ఉండాంటే అందుకు ప్రత్యేకమైన ఆహారం అవసరం. కొవిడ్తో మన ఆహారంపై కొంత శ్రద్ధ పెరిగింది. కొవిడ్ అనంతరం చిన్నాపెద్దా తేడా లేకుండా చాలామందిలో మతిమరపు కనిపిస్తోందని పరిశీలనల్లో తేలింది. కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియకున్నా సరైన ఆహారం ద్వారా దీన్ని తగ్గించుకోవచ్చు అన్నది సారాంశం. ఉదాహరణకు పొట్టలో నొప్పి వస్తేనో లేదా తిన్నది సరిగ్గా అరగకపోతేనో దాని ప్రభావం కేవలం పొట్టకే పరిమితం కాదు. మెదడు కూడా సరిగ్గా పనిచేయదు. మన ఆలోచనాశక్తినీ ఏకాగ్రతనీ జ్ఞాపకశక్తినీ ప్రభావితం చేసే కొన్నిరకాల హార్మోన్ల న్యూరోట్రాన్స్ మీటర్లూ పొట్టలో ఉత్పత్తై అవి మెదడుకు చేరతాయి. కాబట్టి పొట్ట ఎంత బాగుంటే మెదడూ అంత చక్కగా పని చేస్తుంది. అదే మనం సరైన ఆహారం తీసుకోకపోతే ఇన్ఫ్లమేషన్కు కారణమయ్యే సైటోకైన్స్ ఎక్కువగా విడుదలై మెదడును దెబ్బతీస్తాయి. అది దీర్ఘకాలంపాటు కొనసాగితే అల్జీమర్స్, మతిమరువూ ఇతరత్రా మానసిక సమస్యలు తలెత్తుతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరావయవాలన్నీ పనిచేస్తాయి. భావోద్వేగాల్ని నియంత్రించుకుంటూ ఆలోచించగలం. ఒక్క మాటలో చెప్పాలంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. అందుకే హార్వర్డ్, జాన్ హాప్కిన్స్.. వంటి సుప్రసిద్ధ యూనివర్సిటీలన్నీ మెదడు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం గురించిన పరిశోధనలమీద దృష్టిని కేంద్రీకరించాయి. మనం తినే ఆహారంలోని విటమిన్లూ ఖనిజాలూ యాంటీ ఆక్సిడెంట్లూ ఆరోగ్యకరమైన కొవ్వులూ మెదడు కణాల పెరుగుదలకి తోడ్పడి వ్యాధుల్ని నివారిస్తాయనీ తేల్చారు. రోజువారీ తీసుకునే ఆహారంలో ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలూ, విటమిన్ -బి6, బి12, విటమిన్ కె తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు సంబంధిత నిపుణులు.
చేపలు:
Diese Geschichte stammt aus der June 18, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 18, 2023-Ausgabe von Vaartha-Sunday Magazine.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ఫోటో ఫీచర్
జలపాతాలను కింది నుంచి చూసి ఆనందించడం సర్వసాధారణం.
ఈ వారం కార్ట్యూన్స్
ఈ వారం కార్ట్యూన్స్
కళ్యాణ క్షేత్రం 'వల్లిమలై'
ఆది దంపతుల ప్రియపుత్రుడు సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడులో ఎక్కువగా కనిపిస్తాయి.
ముగురు దొంగలు
అతను ధనవంతుడు. ఒకసారి ఓ అడవి మార్గంలో పోతున్నాడు.
సాహితీశరథి దాశరథి
సాహిత్యం
చిన్నవయసులోనే సక్సెస్ బిజినెస్
చిన్నవయసులోనే పలు బిజినెస్ అవార్డులను పొందాడు.
వెట్టిచాకిరీ నుంచి విముక్తి
ఆమె ఒక సాధారణ కూలీ పనిచేసుకునే మహిళ. అయితే నేం 'ఆలసు అనేకులను వెట్టిచాకిరీ నుంచి విముక్తిలుగా చేశారు.
నవభారత నిర్మాతలం
నవభారత నిర్మాతలం
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
అపరిమితమైన కోరికలు
గోపయ్యకు చాలా పడవలు ఉండేవి. ఆ వూరి నుండి ఎటువంటి ఎగుమతులు, దిగుమతులు జరగాలన్నా గోపయ్య పడవలే ఆధారం.