డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
Vaartha-Sunday Magazine|October 27, 2024
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
యామిజాల జగదీశ్
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!

డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.అసలా ప్రస్తావన తెచ్చేది కాదు. అయితే ఎప్పుడైనా రెండణాలిచ్చి చాక్లెట్ కొనుక్కుని తినమని చెప్పేది. అప్పట్లో రెండణాలతో రంగరాజా టెంట్ హౌస్లోలో నేల టిక్కెట్ కొనుక్కుని సినిమా చూడొచ్చు.

బామ్మకు ఓ బ్యాంకులో ఖాతా ఉండేది. అందులో కాస్త డబ్బుండేది.ఎప్పుడైనా ఓ ఇరవై అయిదు రూపాయలు తీసుకురమ్మనమని చెప్పేది.వణికే వేళ్లతో ఇరవై అయిదు సార్లు లెక్కపెట్టి ఇస్తారక్కడ.

బ్యాంకుని దోచుకోవడానికి వచ్చిన వాడిలా చూసేవారు నన్ను.

తిరుచ్చీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివినప్పుడు శ్రీరంగం నుంచి తిరుచ్చీ టౌనుకి వచ్చి మూడు నెలలకు ఓ పసుపు రంగు పాస్ ఒకటి కొనిచ్చేది.దాంతో లాల్గుడి ప్యాసింజరులో ప్రయాణం చేసి కాలేజీకి వెళ్లేవాడిని.మధ్యాహ్నం హోటల్లో అన్నం తినడానికి ఇచ్చేది.పెవిన్సులర్ హోటల్లో డబ్బు ఓ దోసె రెండణాలు. కొన్ని సార్లు దోసెను కాకుండా ఇండియా కాఫీ హౌసులో కాఫీ తాగేవాడిని. ఐస్ క్రీం వంటివన్నీ కలగడమే.

ఎంఐటీ(మద్రాసు)లో చదువుతున్నప్పుడు నాన్న హాస్టల్ మెస్ బిల్లు కట్టి నా సబ్బు, దువ్వెన వంటి ఖర్చులకు ఇరవై అయిదు రూపాయలు ఇచ్చేవారు. బడ్డీకొట్టు అయ్యర్ దుకాణంలోనూ, క్రోంపేట్ రైల్వే స్టేషన్ దుకాణంలోనూ ఎప్పుడూ అప్పే. ఆ అప్పు ఎప్పుడు తీర్చానో గుర్తు లేదు.

ఇంజినీరింగ్ చదువు పూర్తి చేసి ఆల్ ఇండియా రేడియోలో ట్రైనింగ్ అప్పుడు స్టైఫండ్గా నూట యాభై రూపాయలు ఇచ్చేవారు. అదొక కలలా అనిపించేది.ఎందుకంటే అప్పటివరకూ నేనంత డబ్బు చూడలేదు.

సౌత్ ఇండియా బోర్డింగ్ మౌస్ అన్నానికి ఖర్చు డెబ్బయి అయిదు రూపాయలు. మిగిలిన డెబ్బయి అయిదు రూపాయలు ఎలా ఖర్చు చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడిని.ఉలెన్ స్వెట్టర్, బోలెడన్ని పుస్తకాలు కొనేవాడిని. నెల చివర్లో రూపాయో..రెండు రూపాయలో మిగిలేవి.

ఆ తర్వాత ఉద్యోగం దొరికింది.1959లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.నెల జీతం 275 రూపాయలు. నాన్నకు ఓ ట్రాన్సిస్టర్ కొనిచ్చాను. అమ్మేమో తనకేదీ అక్కర్లేదంది. ఓ మాండొలిన్ కొని రాత్రీ, పగలూ సాధన చేసేవాడిని. ఇంట్లో ఆంప్లియర్, రికార్డ్ ప్లేయర్ వంటివన్నీ పెట్టి నానా హంగామా చేసేవాడిని.పాపం.. అమ్మ ఆ గోలంతా భరించింది.

Diese Geschichte stammt aus der October 27, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 27, 2024-Ausgabe von Vaartha-Sunday Magazine.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS VAARTHA-SUNDAY MAGAZINEAlle anzeigen
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
December 22, 2024
బాలగేయం గూడు
Vaartha-Sunday Magazine

బాలగేయం గూడు

పిట్టగూడు

time-read
1 min  |
December 22, 2024
వైవిధ్యం సృష్టి విలాసం
Vaartha-Sunday Magazine

వైవిధ్యం సృష్టి విలాసం

కథ

time-read
1 min  |
December 22, 2024
నవ్వుల్ ....రువ్వుల్...
Vaartha-Sunday Magazine

నవ్వుల్ ....రువ్వుల్...

నవ్వు....రుక్విల్...

time-read
1 min  |
December 22, 2024
హ్యాపీ క్రిస్మస్
Vaartha-Sunday Magazine

హ్యాపీ క్రిస్మస్

ఆయన జీవించిన విధానం పరిశుద్ధమైనది. చివరికి ఆయన ఏ పాపం చేయకపోయినా, మనందరి దోషాలను తనపై వేసుకుని, పాపిగా మార్చబడి, మనకు బదులుగా సిలువలో ఆయన మరణించాడు. ఈ సత్యాన్ని తెలుసుకుని, ఆయనను తమ సొంతరక్షకుడిగా అంగీకరించిన వారికి ప్రతిరోజు, ప్రతిక్షణం రక్షణ పర్వదినమే.

time-read
2 Minuten  |
December 22, 2024
Vaartha-Sunday Magazine

ఉసిరి రుచులు

ఈ కాలంలో ఉసిరి వంటకాలకి రెడ్ కార్పెట్ పరిచేస్తాం కదా! ఈసారి కూడా వగరు ఉసిరికి కాస్త తీపి, మరికాస్త ఘాటు, ఇంకాస్త కమ్మదనం కలిపేసి భిన్నమైన వంటకాలు చేసేద్దాం!

time-read
2 Minuten  |
December 22, 2024
ఖాళీ కాలం
Vaartha-Sunday Magazine

ఖాళీ కాలం

ఖాళీ కాలం

time-read
1 min  |
December 22, 2024
మీఠాపాన్ దోస్తానా!!
Vaartha-Sunday Magazine

మీఠాపాన్ దోస్తానా!!

ఈ వారం కవిత్వం

time-read
1 min  |
December 22, 2024
ఊరగాయ
Vaartha-Sunday Magazine

ఊరగాయ

సింగిల్ పేజీ కథ

time-read
2 Minuten  |
December 22, 2024
'తరిగిన బోధన...పెరిగిన వేదన!
Vaartha-Sunday Magazine

'తరిగిన బోధన...పెరిగిన వేదన!

విద్య అనేది ప్రతి ఒక్కరికీ అతి ముఖ్యమైనది.నవసమాజ నిర్మాణానికి విద్య దోహద పడుతుంది

time-read
8 Minuten  |
December 22, 2024